మోడీ కోసం నేపాల్ ప్రధాని ప్రొటోకాల్ ఉల్లంఘన | Breaking protocol, Nepal Prime Minister to personally receive Narendra Modi | Sakshi
Sakshi News home page

మోడీ కోసం నేపాల్ ప్రధాని ప్రొటోకాల్ ఉల్లంఘన

Published Tue, Jul 29 2014 4:12 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

మోడీ కోసం నేపాల్ ప్రధాని ప్రొటోకాల్ ఉల్లంఘన - Sakshi

మోడీ కోసం నేపాల్ ప్రధాని ప్రొటోకాల్ ఉల్లంఘన

ఖాట్మండు: నేపాల్ పర్యటనకు వెళ్లనున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం దక్కనుంది. నేపాల్ ప్రధాన మంత్రి సుశీల్ కోయిరాల ప్రొటోకాల్ నియమాలను సైతం పక్కనబెట్టి మోడీకి స్వయంగా స్వాగతం పలకనున్నారు.

రెండు రోజుల పర్యటన కోసం ఆగస్టు 3న నేపాల్కు వెళ్లనున్న మోడీకి త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏడుగురు మంత్రులు, సీనియర్ అధికారులు, పారిశ్రామిక వేత్తలతో కూడిన 101 మంది ప్రతినిధుల బృందం మోడీకి స్వాగతం పలకనున్నారు. ప్రధాని సుశీల్ కోయిరాల కూడా విమానాశ్రయానికి రానున్నారు. దీన్ని బట్టి మోడీ పర్యటనకు నేపాల్ ఎంతటి ప్రాధాన్యం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చని కోయిరాల సలహాదారు దినేశ్ భట్టారాయ్ పేర్కొన్నారు. మోడీ వెంట మంత్రులు, వ్యాపారవేత్తలు వెళ్లనున్నారు. మోడీ రక్షణ కోసం వాహానాలను ఖాట్మండుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement