
టెహ్రాన్: ఇరాన్‌లో బుధవారం చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్ 737 విమానం టేకాఫ్ తీసుకున్నకొద్ది సేపటికే కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో సిబ్బంది సహా, మొత్తం ప్రయాణీకులు 180 మంది సజీవ దహనమై పోయారు. దీనికి సంబంధించిన భయంకరమైన వీడియోలో ట్విటర్‌లో షేర్ అవుతోంది. మిలిటరీ కమాండర్ ఖాసిం సులేమాని హత్యకు ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడికి పాల్పడింది. దీంతో ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
చదవండి: ఇరాన్‌లో కుప్పకూలిన విమానం
Comments
Please login to add a commentAdd a comment