చైనా తక్కువ చేసి చూపింది: అమెరికా | China hid coronavirus severity in order to hoard medical supplies | Sakshi
Sakshi News home page

చైనా తక్కువ చేసి చూపింది: అమెరికా

May 5 2020 5:10 AM | Updated on May 5 2020 5:10 AM

China hid coronavirus severity in order to hoard medical supplies - Sakshi

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ తీవ్రతను తక్కువగా చేసి చూపడం ద్వారా చైనా అత్యవసరమైన వైద్య సామగ్రిని అక్రమంగా నిల్వ చేసుకుందని అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యురిటీ (డీహెచ్‌ఎస్‌)భావిస్తోంది. చైనా నేతలు ఉద్దేశపూర్వకంగానే వ్యాధి తీవ్రతకు సంబంధించిన సమాచారాన్ని తొక్కిపెట్టారని, ఇది ఈ ఏడాది జనవరి తొలినాళ్లలో జరిగిందని డీహెచ్‌ఎస్‌ ఓ నిఘా నివేదికను సిద్ధం చేసిందని అసోసియేటెడ్‌ ప్రెస్‌ వార్తా సంస్థ తెలిపింది. వైరస్‌ ప్రభావాన్ని తక్కువ చేసి చూపిన చైనా ఆ సమయంలో వైద్య సామాగ్రి దిగుమతులు పెంచి, ఎగుమతులు తగ్గించిందని నివేదికలో పేర్కొన్నట్లు తెలిపింది. వైరస్‌ సాంక్రమిక లక్షణం ఉందని జనవరి ఆఖరు వరకూ చైనా ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలపలేదని నివేదికలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement