మాస్కో: రష్యాకు ఆంత్రాక్స్ భయం పట్టుకుంది. ఈ వ్యాధితో ఓ 12 ఏళ్ల బాలుడు చనిపోయాడు. సుమారు 70 మంది ఆసుపత్రిపాలయ్యారని సోమవారం అధికారులు ప్రకటించారు. రాజధాని మాస్కోకు ఈశాన్యంగా 2 వేల కి.మీల దూరంలోని యామలో-నెనెటెస్కై ప్రాంతంలోని సంచార దుప్పి కాపలాదారుల్లో 9 మందికి ఈ వ్యాధి సోకిందని గుర్తించారు.
1941 తరువాత ఇక్కడ ఆంత్రాక్స్ ప్రబలడం ఇదే ప్రథమం. వాతావరణ మార్పులు కారణంగానే ఆంత్రాక్స్ వచ్చిందని అధికారులు భావిస్తున్నారు. ఆంత్రాక్స్ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
రష్యాకు ఆంత్రాక్స్ భయం
Published Tue, Aug 2 2016 2:08 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM