హిల్లరీ కోసం ఆస్కార్ హీరో | Conversation with Hillary: Leonardo DiCaprio to host Clinton fundraiser | Sakshi

హిల్లరీ కోసం ఆస్కార్ హీరో

Aug 2 2016 5:25 PM | Updated on Aug 24 2018 6:21 PM

హిల్లరీ కోసం ఆస్కార్ హీరో - Sakshi

హిల్లరీ కోసం ఆస్కార్ హీరో

అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ నిర్వహించనున్న విరాళాల సేకరణ కార్యక్రమంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు విజేత లియోనార్డో డికాప్రియో పాలుపంచుకోనున్నాడు.

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ నిర్వహించనున్న విరాళాల సేకరణ కార్యక్రమంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు విజేత లియోనార్డో డికాప్రియో పాలుపంచుకోనున్నాడు. ఈ కార్యక్రమానికి ఆయన ఆతిధేయిగా వ్యవహరించనున్నారు.

ఈ నెల 23న లాస్ ఎంజెల్స్ లో 'హిల్లరీతో సంభాషణ' అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనే ఒక్కొక్కరు దాదాపు 33 వేల డాలర్లకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, దీనిని డికాప్రియో ఇంట్లోనే నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇంకా తుది నిర్ణయం మాత్రం వెలువరించాల్సి ఉంది. గతంలో జూన్ లో కూడా ఇలాంటి కార్యక్రమాన్ని క్లింటన్ కోసం డికాప్రియో నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement