76 శాతం గుండె జబ్బులు ఎందుకు తగ్గాయి? | Coronavirus lockdown: why the Emergencies gone? | Sakshi
Sakshi News home page

76 శాతం గుండె జబ్బులు ఎందుకు తగ్గాయి?

Published Wed, May 6 2020 2:30 PM | Last Updated on Wed, May 6 2020 6:38 PM

Coronavirus lockdown: why the Emergencies gone? - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాల ప్రజలను ఇప్పటికీ భయపెడుతున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌–19 ఆస్పత్రులు మినహా మిగతా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ వార్డులు దాదాపు ఖాళీగా ఉన్నాయి. సాధారణ పరిస్థితుల్లో అవన్నీ హద్రోగులు, క్యాన్సర్‌ రోగులు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారితో అవన్ని కిక్కిర్సి పోయి ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఏ ఆస్పత్రి చూసినా అత్యధికంగా హృద్రోగులు, ఆ తర్వాత క్యాన్సర్‌ రోగులతో కిటకిటలాడుతుండేవి. కరోనా కేసుల తీవ్రత పెరిగినప్పటి నుంచి ఆ కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వచ్చింది. మూడోవంతు నుంచి సగం వరకు కేసులు తగ్గాయని అంతర్జాతీయ డేటాలు తెలియజేస్తున్నాయి. (ఇటలీ : రోనా వ్యాక్సిన్ నిపెట్టేశాం!)

ఎందుకు? 
గుండె జబ్బులతో బాధ పడుతున్నవారు ఆస్పత్రుల్లో చేరకుండా ఇంటి వద్దనే ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారా ? ఇంటి వద్దనే ప్రాణాలు విడుస్తున్నారా? అలాంటిదేమీ లేదని డేటాలు స్పష్టం చేస్తున్నాయి. స్పెయిన్‌లోని 71 కార్డియాక్‌ సెంటర్ల నుంచి సేకరించిన డేటా ప్రకారం హద్రోగులకు స్టంట్లు వేయడం, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలు చేయడం 81 శాతం తగ్గిపోయాయి. వాటిలో స్టంట్లు వేయడం 40 శాతం తగ్గగా, గుండె జబ్బులు రాకండా ముందు జాగ్రత్తతో ఆస్పత్రులకు వెళ్లే వారి సంఖ్య 48 శాతం తగ్గింది. మొత్తంగా హద్రోగ సంబంధిత పరీక్షలు నిర్వహించడం 57 శాతం తగ్గింది. (విదేశాల నుండి విమానాలు.. ప్రణాళిక విడుదల)

అమెరికాలోని 9 ప్రధాన కార్డియాక్‌ సెంటర్ల నుంచి సేకరించిన డేటా ప్రకారం తీవ్రమైన గుండె జబ్బులతో (ఆపరేషన్‌ అవసరం లేని కేసులు) ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య 38 శాతం తగ్గింది. కోవిడ్‌ సమస్య వచ్చినప్పటి నుంచి హద్రోగ పరీక్షలు నిర్వహించడంలో, రోగులకు వైద్య చికిత్సలు అందించడంలో తీవ్ర జాప్యం జరగుతున్నట్లు హాంకాంగ్‌ నుంచి అందిన డేటా తెలియజేస్తోంది. భారత్‌లో ఫిబ్రవరి నెల నుంచి ఏప్రిల్‌ నెలల మధ్య గుండె, క్యాన్సర్, కిడ్నీ, లివర్, లంగ్స్‌ సహా 825 రకాల చికిత్సలకు సంబంధించిన తీవ్రమైన కేసుల సంఖ్య 20 శాతానికి తగ్గిందని ‘నేషనల్‌ హెల్త్‌ అథారిటీ’ సేకరించిన డేటా ప్రకారం స్పష్టం అవుతోంది. అదే ఫిబ్రవరి–ఏప్రిల్‌ నెలల మధ్య గుండె జబ్బులకు సంబంధించిన చికిత్సలు 76 శాతం తగ్గాయి. తీవ్రమైన గుండె కేసులు కూడా గణనీయంగా తగ్గినట్లు ఆస్పత్రుల డేటాలు తెలియజేస్తున్నాయి. 

ఇవి కారణాలు కావచ్చు!
1. కోవిడ్‌ కారణంగా అనారోగ్యానికి చెందిన స్వల్ప లక్షణాలతో ఆస్పత్రులకు పరుగెత్తక పోవడం, 

2. కరోనా వైరస్‌ను దష్టిలో పెట్టుకొని గుండె రక్త నాళాల్లో పేరుకు పోయిన రక్తాన్ని తొలగించేందుకు వైద్యులు సర్జికల్‌ పద్ధతులను అనుసరించక పోవడం. బ్లడ్‌ క్లాట్స్‌ను కరగించేందుకు ట్యాబ్లెట్లను సిఫార్సు చేయడం. క్లాట్స్‌ను కరిగించేందుకు ఇప్పుడు మంచి మందులు అందుబాటులో ఉండడంతోపాటు ‘కీలేషన్‌ థెరపి’ లాంటి ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వచ్చాయి. 

3. గుండె జబ్బులను పెంచే పర్యావరణ కాలుష్యం తగ్గిపోవడం.

4. ఇళ్ల నుంచి పని చేసే సౌకర్యం లభించడంతో వత్తిపరమైన ఒత్తిళ్లు తగ్గిపోవడం. గుండె జబ్బులు కలిగిన వారిలో 50 శాతం మందికి వత్తిపరమైన ఒత్తిళ్ల వల్లనే గుండె జబ్బులు వస్నున్నాయన్నది తెల్సిందే. 

5. ప్రయాణ బడలికలు కూడా తగ్గిపోవడం.

6. వేళకు నిద్రపోయే వెసలుబాటు లభించడం.

7. ఆరోగ్యానికి హానికరమైన ధూమపానం, మద్యపానం అందుబాటులో లేకపోవడం. 

8. లాక్‌డౌన్‌ కారణంగా వాటిల్లుతోన్న ఆర్థిక నష్టం ముందు స్వల్ప అనారోగ్య సమస్యలను పట్టించుకోక పోవడం. 

9. కరోనా కారణంగా ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడం. 

10. ఇక రోడ్డు ప్రమాదాల విషయానికి వస్తే లాక్‌డౌన్‌ కారణంగా వాహనాల రాకపోకలు లేకపోవడం వల్ల ప్రమాదాలు పూర్తిగా తగ్గిపోయాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement