
వాషింగ్టన్: కరోనా రక్కసి కోరల్లో చిక్కుకున్న అగ్రరాజ్యం అమెరికా మృతుల్లో మొదటి స్థానానికి చేరుకుంది. రోజూ రెండు వేలకు పైగా మరణాలు నమోదవుతున్న వేళ కోవిడ్ మృతుల్లో ఇటలీతో పోటీపడుతూ వస్తున్న యూఎస్ శనివారం రాత్రి అందిన లెక్కల మేరకు 20 వేల 506 మృతులతో తొలి స్థానంలో నిలిచింది. వైరస్ బారినపడ్డ లెక్కల్లోనూ అమెరికా 5,27,111 కేసులతో తొలిస్థానంలో ఉంది. ఇక యూరప్ దేశాల్లో కోవిడ్ దెబ్బకు ఎక్కువగా బలి అవుతున్న ఇటలీ 19,468 మరణాలతో రెండో స్థానంలో ఉంది. అయితే, జనాభా పరంగా యూఎస్‌తో పోల్చుకుంటే ఇటలీ ఐదు రెట్లు చిన్నది కావడం గమనార్హం.
(చదవండి: కరోనా మిస్టరీలు)
ఇక చైనాలోని వుహాన్ నగరంలో పుట్టుకొచ్చిన మహమ్మారి కరోనా ఆ దేశంలో తగ్గముఖం పట్టిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో అక్కడ విధించిన ఆంక్షల్ని ఎత్తివేస్తున్నారు. అయితే, యూరప్, యూఎస్‌లో మాత్రం కోవిడ్ విజృంభణ అంతకంతకూ పెరుగుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్ మతస్తులు శనివారం ఈస్టర్ హాలిడే వారాంతాన్ని లాక్‌డౌన్ పరిస్థితుల్లో ఇళ్లల్లోనే జరుపుకున్నారు. లాక్‌డౌన్ ఆంక్షలతో వాటికన్ సిటీలో హంగు ఆర్భాటాలు లేక వెలవెలబోయింది. ఈస్టర్ డే సందర్భంగా పీటర్స్ బ్రసీలియా ప్రాంగణం నుంచి పోప్ ఫ్రాన్సిస్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రపంచానికి సందేశం ఇచ్చారు.
(చదవండి: నా జీవితంలో అతి పెద్ద నిర్ణయం)
Comments
Please login to add a commentAdd a comment