బ్రసెల్స్: బ్రెగ్జిట్ రెఫరెండం తర్వాత తొలిసారిగా జరిగిన యురోపియన్ నేతల సమావేశం బుధవారం బ్రసెల్స్‌లో నిర్వహించారు. భేటీలో బ్రిటన్ ప్రతినిధి లేకపోవటం 40 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ సమావేశంలో బ్రిటన్‌ను వీలైనంత త్వరగా పంపిచేయాలని సభ్యులంతా నిర్ణయించారు. బ్రిటన్‌ను పంపించేందుకు నిబంధనలను సరళీకృతం చేయటం ద్వారా.. ఇతర దేశాలు కూటమినుంచి పోయేందుకు అనుమతిచ్చినట్లే అవుతుందనే అంశంపైనా ఈ భేటీలో చర్చ జరిగింది.
అయితే బ్రిటన్ వెళ్లిపోయినా తాము మాత్రం ఈయూలోనే ఉంటామంటున్న స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ నికోలా స్టుర్జియోన్ బ్రసెల్స్‌లోనే మకాం వేశారు.
బ్రిటన్ లేకుండానే ఈయూ మీటింగ్
Published Thu, Jun 30 2016 1:54 AM | Last Updated on Thu, Jul 11 2019 8:00 PM
Advertisement
Advertisement