పైరేటెడ్ షో కు.. గిన్నిస్ టైటిల్...!
లండన్ః ప్రపంచ రికార్డు సాధించాలంటే అంతకు ముందెన్నడూ లేని విధంగా కొత్తగా, విభిన్నంగా ఏదైనా చేసి చూపించాలి. లేదంటే సాహసాలు చేయాలి. అయితే.. భారీ అక్రమాలకు పాల్పడినా రికార్డు సాధించొచ్చునన్న విషయం ఇప్పుడు కొత్తగా తెరసైకి వచ్చింది. లండన్ లో ఎంతో ప్రాముఖ్యత పొందిన.. మోస్ట్ పైరేటెడ్ షో గా గుర్తించబడిన పాపులర్ సీరియల్.. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' గిన్నిస్ రికార్డులకెక్కింది.
హెచ్ బీవో సంచలనాత్మక ఇంగ్లీష్ టీవీ ధారావాహిక... 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది. ఫాంటసీ డ్రామా గేమ్.. వరల్డ్ రికార్డును సాధించింది. 2017 గిన్నిస్ సంచిక ప్రకారం.. ఈ పైరేటెడ్ హిట్ సీరియల్.. వరుసగా నాలుగోసారి టైటిల్ గెలుచుకుంది. ధారావాహికలోని ఒక్కో ఎపిసోడ్ కోసం సుమారు 14.4 మిలియన్ల అక్రమ డౌన్ లోడ్లను కూడా చేసుకొన్న ఈ సీరియల్.. ప్రపంచ రికార్డులకెక్కింది. టీవీ సిరీస్ ద్వారా మోస్ట్ ఎమ్మీ అవార్డ్స్ కు శీర్షిక గా మారిన ఈ ఫాంటసీ డ్రామా.. ఐదవ సీజన్ లో మొత్తం 12 అవార్డులను కూడా గెలుచుకుంది.