శ్రీధర్‌ ఘనత.. నమ్మి తీరాల్సిందే! | Guinness Record Holder Shridhar Chillal Finally Nailed It | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 13 2018 9:40 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

Guinness Record Holder Shridhar Chillal Finally Nailed It - Sakshi

ప్రపంచంలో అత్యంత పొడవైన గోళ్లతో గిన్నిస్‌ రికార్డులో చోటు సంపాదించుకున్న శ్రీధర్ ఛిల్లల్‌(82).. ఎట్టకేలకు వాటిని కత్తిరించేసుకున్నారు. పుణేకు చెందిన ఈ పెద్దాయన.. 1952 నుంచి తన ఎడమచేతి గోళ్లను పెంచుతూ వస్తున్నారు. అయితే చేతికి పక్షవాతం సోకటంతో చివరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. న్యూయార్క్‌లోని టైమ్ స్వేర్‌లో జరిగిన ‘నెయిల్ క్లిప్పింగ్ సెర్మనీ’లో 31 అడుగుల పోడవైన గోళ్లను కత్తిరించేసుకున్నారు. అంతేకాదు రిప్‌లే'స్‌ బిలివ్‌ ఇట్‌ ఆర్‌ నాట్‌!(వింతలను ఈ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచుతారు) మ్యూజియమ్‌ నిర్వాహకులు శ్రీధర్‌ నుంచి వాటిని కొనుగోలు చేసి.. ప్రదర్శనకు ఉంచారు. 

66 ఏళ్ల కష్టం... గవర్నమెంట్‌ ప్రెస్‌ ఫోటోగ్రాఫర్‌గా విధులు నిర్వహించిన రిటైర్‌ అయిన శ్రీధర్‌.. ‘గోళ్లు పెంచటం ఏనాడూ ఇబ్బందిగా అనిపించలేదు’అని చెబుతున్నారు. హైస్కూలులో ఉండగా తన టీచర్ చేతి గోరును అనుకోకుండా శ్రీధర్‌ విరగ్గొట్టడంతో టీచర్‌ కోప్పడ్డారట. పొడవైన గోళ్లు పెంచడం అంత తేలికైన విషయం కాదు అని టీచర్ చెప్పేసరికి శ్రీధర్‌కి ఆ ఆలోచన కలిగింది. అంతే.. అప్పటి నుంచి తన చేతి గోళ్లను పెంచడం ప్రారంభించారు. ఎవ్వరు వద్దన్నా, చివరకు టీచరే వ్యతిరేకించినా సరే ఆయన విన్లేదు. గోళ్ల కారణంగా శ్రీధర్‌ పెళ్లీడు వచ్చినా పిల్లను ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. అయినా సరే గోళ్లను కట్ చేయడానికి మాత్రం ఆయన ససేమిరా అన్నారు. చివరకు 29 ఏళ్ల వయసులో బంధువుల అమ్మాయితో ఎలాగోలా పెళ్లి కుదిరింది. అప్పటివరకు రెండు చేతుల గోళ్లూ పెంచిన శ్రీధర్.. భార్య మాట విని కుడి చేతి గోళ్లు కట్ చేశారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. మూడేళ్ల క్రితం గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కగా(ఆ సమయంలో 30 అడుగులు).. అతడి రికార్డు పరిగణనలోకి తీసుకుని ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని పలువురు నేతలు పుణే మున్సిపల్ కార్పోరేషన్‌కు విజ్ఞప్తి కూడా చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement