
ట్రంప్ నోట రోజుకో మాట
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం గెలుచుకోక ముందు వలసలు, అందుకు అనుమతించే వీసా విధానాలపై ట్రంప్ నిప్పులు చెరిగారు.
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం గెలుచుకోక ముందు వలసలు, అందుకు అనుమతించే వీసా విధానాలపై ట్రంప్ నిప్పులు చెరిగారు. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిలరీ క్లింటన్తో జరిగిన టీవీ డిబేట్లో మాట మార్చారు. హెచ్1బీ వీసాల కొరత కారణంగా ప్రతిభాపాటవాలున్న నిపుణులను అమెరికా కోల్పోతోందని ఆయన వాదించారు. ‘‘విదేశాల నుంచి వచ్చిన తెలివిగల విద్యార్థులు ఇక్కడి హార్వర్డ్, యేల్, ప్రిన్స్టన్ వర్సిటీల్లో చదువుకుంటారు.
(చదవండి : అమెరికాతో బంధం ఏనాటిదో..!)
నిర్ణీత కాలంలో వీసాలు లభించని ఈ విద్యార్థులను వారి దేశాలకు పంపేస్తున్నారు. వారంతా సిలికాన్ వ్యాలీలో పనిచేయడానికి ఇక్కడే ఉంచాలనేదే నా ఆకాంక్ష’’ అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. కానీ వెంటనే మళ్లీ ట్రంప్ పాత మాటలకే కట్టుబడినట్టు ప్రకటన విడుదల చేశారు. హెచ్1బీ వీసాలను సమర్ధించననీ, తక్కువ జీతాలకు కార్మికులను తీసుకురావడానికి ఈ వీసా వాడడాన్ని నిషేధిస్తానని ఆయన వివరించారు.
(చదవండి : 100 మందిలో ఒకరు భారతీయులే!)
(చదవండి : డాలర్ డ్రీమ్స్పై ట్రంప్ వేటు!)