
జిహాద్ పేరుతో ఉగ్రవాద వ్యాప్తి..
లాహోర్: ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి, జమత్ ఉద్ దవా(జేయూడీ) చీఫ్ హఫీజ్ సయీద్ జిహాదీ పేరుతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాడని, అందుకే అతన్ని నిర్బంధంలోకి తీసుకున్నామని పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ జ్యుడీషియల్ రివ్యూ బోర్డుకు తెలిపింది.
సయీద్ అతడి సహాయకులు జాఫర్ ఇక్బాల్, అబ్దుల్ రెహమాన్, అబ్దుల్లా ఉబెద్, క్వాజి కషిఫ్ నైజ్ జిహాదీ పేరుతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ప్రచారం చేస్తున్నారని బోర్డుకు తెలిపింది. ఇందుకు సంబంధించి ఆధారాల్ని అందజేయాల్సిందిగా ప్రభుత్వాన్ని బోర్డు ఆదేశించింది.