‘కశ్మీరీల బాధ్యత పాకిస్తాన్ దే’ | Hafiz Saeed to Pakistan govt: Don't forge friendship with India | Sakshi
Sakshi News home page

‘కశ్మీరీల బాధ్యత పాకిస్తాన్ దే’

Published Wed, Dec 28 2016 8:35 AM | Last Updated on Mon, Sep 4 2017 11:49 PM

‘కశ్మీరీల బాధ్యత పాకిస్తాన్ దే’

‘కశ్మీరీల బాధ్యత పాకిస్తాన్ దే’

లాహోర్‌: భారత్‌తో స్నేహం కుదుర్చుకోవడానికి ప్రయత్నించొద్దని పాకిస్తాన్‌ను జమాత్‌ –ఉద్‌ –దవా చీఫ్, 2008లో జరిగిన ముంబై దాడుల ప్రధాన కుట్రదారుడు హఫీజ్‌ సయీద్‌ కోరాడు. భారత బలగాలు కశ్మీర్‌లో అకృత్యాలకు పాల్పడుతున్నాయని ఆరోపించాడు. అక్కడి జనాభా, భౌగోళిక రూపురేఖలను మార్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పాడు.

కశ్మీరీల సమస్యలు పరిష్కరించడానికి పాకిస్తాన్‌ ప్రభుత్వం చొరవ చూపాలని కోరాడు. ‘స్వాతంత్య్రం కోసం కశ్మీరీలు చేస్తున్న ఉద్యమానికి మా పూర్తి మద్దతు ఉంటుంది. అక్కడ రక్తం చిందుతోంది. వారి సమస్యలు పరిష్కరించే బాధ్యత పాకిస్తాన్‌ ప్రభుత్వానిదే’ అని సయీద్‌ అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement