Kashmiris
-
ఇంటర్నెట్ కోసం 100కి.మీ. వెళ్తున్నారు!
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ జమ్మూ కశ్మీర్లో ఇప్పటికీ బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ నెట్ సర్వీసులను ప్రభుత్వం పునరుద్ధరించకపోవడంతో దాదాపు వెయ్యిమంది కశ్మీరీలు ప్రతిరోజు సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న బనిహాల్ పట్టణానికి రైల్లో వెళుతున్నారు. దీంతో ప్రతి రోజూ ఇక్కడి రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. కేవలం నాలుగువేల మంది జనాభా కలిగిన బనిహాల్ పట్టణంలో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు కలిగిన ఆరు ఇంటర్నెట్ కేఫ్‌లు నడుస్తున్నాయి. ఈ కేఫ్‌లు ఒక్కో వినియోగదారుడి నుంచి గంటకు మూడు వందల రూపాయల చొప్పున వసూలు చేస్తున్నాయి. ఎక్కువగా ఈ కేఫ్‌లకు విద్యార్థులు, ఉద్యోగం వేటలో ఉన్న నిరుద్యోగులు, ఆదాయం పన్ను శాఖ అధికారులు వస్తున్నారని కేఫ్ యజమానులు తెలిపారు. ‘ఉద్యోగం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వచ్చాను. ఈ అవకాశాన్ని నేను వదులుకోలేను’ అని కశ్మీర్ నుంచి బనిహాల్ పట్టణానికి వచ్చిన అహ్మద్ తెలిపారు. పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ కోసం ఎక్కువగా ఇంటర్నెట్ కేఫ్‌లను ఆశ్రయించాల్సి వస్తోందని విద్యార్థులు తెలిపారు. ఆన్లైన్ ద్వారా ఉద్యోగం చేసే వారు కూడా ఈ కేఫ్లపైనే ఆధారపడుతున్నారు. మరికొన్ని రోజుల్లో కశ్మీర్ అంతటా ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరించకపోయినట్లయితే తాను ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుందని కశ్మీర్ కొరియర్ సర్వీసులో పనిచేస్తున్న తౌసీఫ్ అహ్మద్ తెలిపారు. తమ కంపెనీలో ఇప్పటికే 50 మంది యువకులు ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. కశ్మీర్‌కున్న ప్రత్యేక హోదాను రద్దు చేసి, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన గత ఆగస్టు ఐదవ తేదీ నుంచి ఇంటర్నెట్ సర్వీసులను రద్దు చేసిన విషయం తెల్సిందే. ఫలితంగా రాష్ట్రంలో ఐదు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని కశ్మీర్ పరిశ్రమల మండలి ఉపాధ్యక్షుడు అబ్దుల్ మజీద్ మీర్ తెలిపారు. ప్రధానంగా పర్యాటకులపై ఆధారపడి బతుకుతున్న దాల్ లేక్ బోటు యజమానులు నాలుగువేల మంది ఉపాధి కోల్పోయారు. ఇంటర్నెట్ సర్వీసుల రద్దు వల్ల వివిధ పరిశ్రమలకు ఇప్పటికే దాదాపు 250 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇంటర్నెట్ సర్వీసులు పౌరుల ప్రాథమిక హక్కుంటూ 2016లోనే ఐక్యరాజ్య సమతి ప్రకటించినప్పటికీ, వారం రోజుల్లో కశ్మీర్లో ఈ సర్వీసులను పునురుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్న రాష్ట్ర అధికార యంత్రాంగం ఇప్పటికీ స్పందించలేదు. దీంతో కశ్మీరీలకు ‘ఇంటర్నెట్ ఎక్స్‌ప్రెస్’గా వ్యవహరిస్తున్న బనిహాల్ పట్టణానికి తీసుకెళ్లే రైళ్లే గతి అవుతున్నాయి. -
పైసలిస్తే.. ఎవరైనా వస్తారు!?
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ జమ్మూకశ్మీర్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో కశ్మీర్ అంతటా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పూర్తిగా భద్రతా దళాల నీడలో ఉన్న కశ్మీర్ లోయలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేయడానికి దోవల్ స్వయంగా పర్యటించారు. ఈ సందర్భంగా షోపియన్ జిల్లాలో స్థానికులతో కలిసి ఆయన మధ్యాహ్న భోజనం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై స్థానికుల్లో విశ్వాసం కల్పించేలా స్థానికులతో మాటా-మంతి కలిపారు. స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నాయని దోవల్ వారిని ప్రశ్నించగా.. అంతా బాగుందని వారు బదులిచ్చారు. ‘ఔను. అంతా కుదురుకుంటుంది. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా జీవించే రోజులు వస్తాయి. ఆ భగవంతుడు ఏం చేసినా మన మంచి కోసమే చేస్తాడు. మీ భద్రత, సంక్షేమం కోసం మేం తపిస్తున్నాం. రానున్న తరాల అభివృద్ధి సంక్షేమం కోసం మేం కృషి చేస్తున్నాం’ అని దోవల్ వారితో తెలిపారు. మీ పిల్లలకు మంచి విద్య అందించేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారిలో దోవల్ భరోసా నింపారు. ఈ మేరకు షోపియన్ జిల్లాలో స్థానికులతో దోవల్ భోజనం చేస్తున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేంద్రం నిర్ణయాలను స్థానికులు స్వాగతిస్తున్నారని, లోయలో పరిస్థితులు అంతా సవ్యంగా ఉన్నాయని దోవల్ ఇప్పటికే కేంద్రానికి నివేదిక ఇచ్చినట్టు కథనాలు వచ్చాయి. అయితే, షోపియన్‌లో స్థానికులతో దోవల్ భోజనం చేసిన వీడియోపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, జమ్మూకశ్మీర్ నేత గులాం నబీ ఆజాద్ పెదవి విరిచారు. పైసాలిస్తే ఎవరైనా మీతో కలిసివస్తారంటూ ఆయన ఎద్దేవా పూర్వకంగా వ్యాఖ్యలు చేశారు. -
అల్లరిమూకలపై కఠిన చర్యలు
కాన్పూర్/వారణాసి/రన్సాయ్/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కశ్మీరీలపై దాడులు చేస్తున్న అల్లరిమూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ రాష్ట్రాలను ఆదేశించారు. దేశాన్ని ఐక్యంగా ఉంచే వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. లక్నోలో ఇటీవల కశ్మీరీ వ్యాపారులపై కొందరు దుండగులు దాడిచేసిన నేపథ్యంలో ప్రధాని స్పందించారు. కశ్మీరీ సోదరులపై లక్నోలో దాడిచేసిన మూర్ఖులపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన మోదీ, లక్నో ఉత్తర–దక్షిణ కారిడార్ మెట్రో సేవలను ప్రారంభించారు. సహాయ నిరాకరణ చేశారు.. కాశీవిశ్వనాథ్ ఆలయం అప్రోచ్ రోడ్డు–సుందరీకరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం మోదీ మాట్లాడుతూ..‘యూపీలో సమాజ్‌వాదీ ప్రభుత్వం కారణంగా మొదటి మూడేళ్లు వారణాసిలో సహాయ నిరాకరణ ఎదురైంది. అందువల్లే వారణాసి సుందరీకరణ ప్రాజెక్టు ఆలస్యమైంది. కానీ మీరు(ప్రజలు) యోగి ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాక ప్రాజెక్టుల నిర్మాణం వేగం పుంజుకుంది. ఈ విషయంలో గత ప్రభుత్వాలు సహకారమందించి ఉంటే ఇప్పుడు శంకుస్థాపన కాకుండా ప్రాజెక్టును ప్రారంభించి ఉండేవాళ్లం. 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా బాబాను (కాశీ విశ్వనాథుడ్ని) పట్టించుకోలేదు. అందరూ మౌనంగా ఉండిపోయారు. అందుకే ‘నువ్వు(మోదీ) ఎక్కువగా మాట్లాడుతావు. ఇప్పుడు ఇక్కడికి(వారణాసి)కి వచ్చి ఏదైనా చేయ్’ అని ఆ పరమశివుడు నిర్ణయించి ఉంటాడు. కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టులో భాగస్వామి కావడాన్ని నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా’ అని తెలిపారు. -
ఆహా.. యూపీలో ఏమి సహనం?!
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఎవరైనా అంటే.. అన్న వారిని పట్టుకొని చావ చితక్కొడుతారు అక్కడి అల్లరి మూకలు. బుధవారం నాడు ఒక్క రోజులో జరిగిన నాలుగు దైర్జన్య, హింసాత్మక సంఘటనలు అక్కడి ‘సహనానికి’ మచ్చుతునకలు. లక్నోలో బుధవారం పట్టపగలు రోడ్డు పక్కన డ్రైఫ్రూడ్స్ అమ్ముతున్న ఇద్దరు కశ్మీరీలను పట్టుకొని కాషాయ దుస్తులు ధరించిన యువకులు చితకబాదారు. పైగా వారే వీరోచితంగా వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. (యూపీలో కశ్మీరీలపై దుండగుల దాడి) అదే రోజు ముజాఫర్‌నగర్‌లో విద్యా, ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఓ టీవీ కార్యక్రమంలో ప్రశ్నించినందుకు ఓ యువకుడిని వెతికి పట్టుకొని బీజేపీ కార్యకర్తలు చితక బాదారు. టెర్రరిస్టుగా ముద్ర వేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఆన్లైన్లో సర్కులేట్ అవుతోంది. అదే రోజు సంత్ కబీర్ నగర్ జిల్లాలో బీజేపీ ఎంపీ, బీజేపీ ఎమ్మెల్యే ప్రజల ముందే బహిరంగంగా కొట్టుకున్నారు. వారిద్దరు ఓ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. శంకస్థాపన పలకం మీద తన పేరు ఎందుకు లేదంటూ బీజేపీ ఎంపీ శరద్ త్రిపాఠి ప్రశ్నించారు. పేర్లు పెట్టదల్చుకోలేదని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ సింగ్ బాఘెల్ సమాధానం చెప్పారు. దాంతో ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది. పట్టలేని ఆవేశానికి గురైన బీజేపీ ఎంపీ శరద్ త్రిపాఠి ఒక్కసారిగా తన కాలికున్న బూటును లాగి దాంతో బాఘెల్ నెత్తిపై ఠపీ ఠపీమంటూ కొట్టారు. ఆ తర్వాత ఈ సంఘటనకు ప్రతీకారంగా జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలోకి ఎమ్మెల్యే అనుచరులు జొరబడి అక్కడున్న ఎంపీ శరద్ త్రిపాఠిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు లాఠీచార్జి జరిపి వారిని చెదరగొట్టారు. (ఎమ్మెల్యేను షూతో చితక్కొట్టిన బీజేపీ ఎంపీ) అదే రోజు మీరట్‌లో గుడిశెవాసులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలు రాళ్లు విసురుకున్నారు. పోలీసులు వచ్చి దౌర్జన్యంగా తమ గుడిసెలను తగులబెట్టారంటూ గుడిశెవాసులు రోడ్డెక్కి ప్రైవేటు వాహనాలను, బస్సులను దగ్ధం చేశారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఎంతటి ‘సహనం’ రాజ్యమేలుతుందో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ మరుసటి రోజు అంటే, గురువారం నాడు ఆదిత్యనాథ్ యోగి ప్రభుత్వం ‘నయే భారత్ నయా ఉత్తరప్రదేశ్’ నినాదంతో ఇచ్చిన పూర్తి పేజీ యాడ్ అన్ని ప్రధాన పత్రికల్లో ప్రచురితమైంది. తన ప్రభుత్వం హయాంలో అన్ని నగరాల్లో శాంతి భద్రతల పరిస్థితి మెరుగయిందని, నేరస్థులను అనుమాత్రం ఉపేక్షించమనే తమ విధానం విజయవంతం అయిందని కూడా ఆ యాడ్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఆ యాడ్ మధ్య భాగంలో శాంతి భద్రతల పరిస్థితి మెరగయిందన్న శీర్షిక కింద నేరాల పట్ల అణు మాత్రం సహించని విధానాన్ని అమలు చేస్తున్నామని, పోలీసు బృందాల ఎన్కౌంటర్ల వల్ల 69 మంది నేరస్థులు మరణించారని, 7043 మంది అరెస్టయ్యారని, ప్రభుత్వ విధానంలో వచ్చిన మార్పును గమనించి 11,981 మంది నేరస్థులు తమ బెయిళ్లను రద్దు చేసుకొని కోర్టుల ముందు హాజరయ్యారని చెప్పడంతో రాష్ట్ర పోలీసులు అందిస్తున్న సేవల గురించి, లక్ష మంది పోలీసుల నియామకానికి ప్రక్రియ కొనసాగుతోందని కూడా ఆ యాడ్‌లో పేర్కొన్నారు. బుధవారం జరిగిన నాలుగు, దౌర్జన, హింసాత్మక సంఘటనలకు సబంధించిన వీడియోలు అందుబాబులో ఉన్నా ఒక్క గుడిశెవాసులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి మినహా మిగతా మూడు సంఘటనల్లో పోలీసులు ఇంతవరకు ఏ చర్యా తీసుకోలేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు. అనవసరమైన పబ్లిసిటీ పేరిట లక్షల రూపాయలు తగిలేసే బదులు, శాంతి భద్రతల పరిరక్షణకు కేటాయిస్తే ఎప్పటికైనా ‘సహనం’ వస్తుందేమో! -
యూపీలో ఒక్క రోజులోనే నాలుగు హింసాత్మక సంఘటనలు
-
కశ్మీరీలపై దాడులు.. మౌనం వీడిన మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: పూల్వామా ఉగ్రవాద దాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న కశ్మీరీలపై జరుగుతున్న దాడులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఖండించారు. అలాంటి దాడులకు దేశంలో తావు లేదని ఆయన స్పష్టం చేశారు. మానవత్వానికి శత్రువైన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ పోరాటం చేస్తుందే కానీ, కశ్మీర్‌కు, కశ్మీరీలకు వ్యతిరేకంగా కాదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. గతవారం పూల్వామాలో సైనిక కాన్వాయ్ లక్ష్యంగా జరిగిన ఉగ్రవాద దాడిలో 40మందికిపైగా జవాన్లు మృతిచెందడంతో.. పలు రాష్ట్రాల్లో కశ్మీరీలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. దాడులు నివారించేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు సత్వరమే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం రాజస్థాన్ టాంక్ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. కశ్మీరీలపై దాడుల అంశం మీద తొలిసారిగా స్పందించారు. ‘ఇటీవలికాలంలో సోషల్ మీడియాలో వీరరసం ఉప్పొంగుతోంది. కానీ మన సోదరులు, అక్కాచెల్లెళ్లు ఒక్క విషయం గుర్తించాలి. మన పోరాటం ఉగ్రవాదం, మానవాళికి శత్రువులైనవారిపై మాత్రమే. మన కశ్మీరీల కోసం పోరాడుతున్నాం. కానీ వారికి వ్యతిరేకంగా కాదు. గత కొన్నిరోజులుగా దేశంలో పలుచోట్ల కశ్మీరీలకు వ్యతిరేకంగా జరిగింది చిన్నదైనా కానివ్వండి.. పెద్దదైనా కానివ్వండి. అలాంటి వాటికి దేశంలో తావులేదు. అవి దేశంలో జరగకూడదు. కశ్మీరీ పిల్లలు ఉగ్రవాదంతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి మనతో చేతులు కలిపేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. వారిని మనం కలుపుకొని ముందుకుసాగాలి’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
సరస్సులో మూత్ర విసర్జన.. ఇదిగిదిగో స్వచ్ఛ భారత్!
సాక్షి, న్యూఢిల్లీ : అమరనాథ్ యాత్ర కోసం కశ్మీర్లో అడుగుపెట్టిన ఉత్తర, దక్షిణాది భారతీయులు ప్రపంచ ప్రసిద్ధి చెందిన దాల్ సరస్సు ఒడ్డున మూత్ర విసర్జన చేయడం పట్ల కశ్మీరీలు మండిపడుతున్నారు. మరోపక్క మహిళలు కూడా సామూహికంగా మూత్ర విసర్జనలు చేయడం ఏమిటని? ఇదెక్కడి సంస్కృతి అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. సరస్సు ఒడ్డున మగవాళ్లు మూత్ర విసర్జన చేస్తున్న ఫొటోను ప్రచురించిన ‘కాశ్మీర్ వాలా, ది సిటిజెన్’ లాంటి స్థానిక పత్రికలు ఈ తీరును తప్పుబట్టగా.. అలాంటి ఫొటోలతోని ట్విట్టర్, వాట్సాప్‌లలో కొందరు తమదైన శైలిలో స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ను చూసి మీరు నేర్చుకున్నది ఇదేనా ? అంటూ కొందరు.. ‘టాయ్‌లెట్’ బాలీవుడ్ సినిమా చూడలేదా అంటూ మరికొందరు స్పందించారు. అమర్నాథ్ యాత్ర కోసం భారీ బందోబస్తుతోపాటు ఎక్కడికక్కడ భారీ ఎత్తున మరుగుదొడ్లు, వసతి సౌకర్యాలను ఏర్పాటు చేశామని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే దాల్ లేక్‌ను ఎందుకు పాడుచేస్తున్నారని వారు ప్రశ్నించారు. ‘మేం బతకడానికి ఆర్థికంగా ఎంతో సహాయం చేస్తున్నామని చెప్పుకునే మీరు ఈ కుసంస్కారాన్ని ఎలా సమర్థిస్తారు?’ ఇంకొకరు ట్వీట్లు చేస్తున్నారు. విమర్శలు చేస్తున్నవారిలో కశ్మీర్ ముస్లింలతోపాటు హిందువులు, ముఖ్యంగా పండిట్లు కూడా ఉన్నారు. ‘ అమర్నాథ్ యాత్రికులను మా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కానీ మీరు మా సహజ వనరులను కలుషితం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేసే మనస్తత్వాన్ని ఎవరైనా ఖండించాల్సిందే. ఇది విచారకరమే కాదు, సిగ్గుచేటైన విషయం. అత్యున్నత ఆధ్యాత్మిక స్ఫూర్తితో వెళుతున్న యాత్రికులకు కూడా మీరు అగౌరవం తీసుకొచ్చారు. మీరు ఏ రాష్ట్రం వారైనా కావచ్చు. స్వచ్చ భారత్ అభియాన్‌కు మచ్చతెచ్చారు’ అని సామాజిక కార్యకర్త, కశ్మీర్ పండిట్ సంజయ్ పార్వ వ్యాఖ్యానించారు. దాల్ సరస్సు పక్కన పారిశుద్ధ్య పరిస్థితులు అంత సవ్యంగా లేకపోవడం వల్లనే అక్కడ యాత్రికులు మూత్ర విసర్జన చేశారని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ముందు తమరు ముందు నేర్చుకోండంటూ కశ్మీరీలకు కొందరు కౌంటర్ ట్వీట్లు ఇచ్చారు. -
'కశ్మీరీలకు భద్రత కల్పించండి'
న్యూఢిల్లీ: దేశం నలుమూలలా నివసిస్తున్న కశ్మీరీల భద్రతను కాపాడాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కశ్మీరీలను వేధిస్తున్నారనే ఆరోపణలపై స్పందించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మేరకు ఓ అడ్వైజరీ పంపినట్లు వెల్లడించారు. మీడియాతో మాట్లాడిన ఆయన దేశంలోని పలు ప్రాంతాల్లో కశ్మీరీలతో కొందరు తప్పుగా ప్రవర్తించారనే విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ మేరకు సూచనలు చేసినట్లు తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో సైన్యంపై రాళ్లు రువ్వడంపై ఉత్తరప్రదేశ్, రాజస్ధాన్ రాష్ట్రాల్లో ఉన్న కశ్మీరీ విద్యార్థులకు బెదిరింపులు ఎదురయ్యాయనే రిపోర్టులు వచ్చిన విషయం తెలిసిందే. -
యూపీలో హోర్డింగుల కలకలం
మీరట్: జమ్మూకశ్మీర్ లో సైనికులపై దాడులను వ్యతిరేకిస్తూ ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో పెట్టిన హోర్డింగులు కలకలం రేపుతున్నాయి. కశ్మీరీలు తమ రాష్ట్రం విడిచి వెళ్లిపోవాలని పేర్కొంటూ ఢిల్లీ-డెహ్రడూన్ జాతీయ రహదారిపై హోర్డింగులు పెట్టారు. సైన్యంపై కశ్మీరీల రాళ్లు రువ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఈ హోర్డింగులు ఏర్పాటు చేసినట్టు ఉత్తరప్రదేశ్ నవనిర్మాణ సేన అధ్యక్షుడు అమిత్ జానీ తెలిపారు. కశ్మీర్ విద్యార్థులు ఎక్కువగా ఉండే కాలేజీలకు సమీప ప్రాంతాల్లో దాదాపు 48 హోర్డింగులు పెట్టినున్నట్టు తెలిపారు. తమ నిరసనలో భాగంగా కశ్మీర్ విద్యార్థులకు ఆహారం, నీరు, నివాసం నిరాకరించాలని యూపీ ప్రజలను నవనిర్మాణ సేన కార్యకర్తలు కోరతారని చెప్పారు. ‘కశ్మీర్ లో ప్రతి రోజు భారత సైనికులపై కశ్మీరీలు రాళ్లు రువ్వుతున్నారు. మీరట్ లో నేను చాలా మంది విద్యార్థులతో మాట్లాడాను. ఇక్కడ చదువుకుంటున్న కశ్మీర్ విద్యార్థులు జాతీయ గీతం, జాతీయ గేయం ఆలపించడం లేదని తెలుసుకున్నాను. ఇక్కడ చదువుకుంటున్న, పనిచేస్తున్న కశ్మీరీలు భారత్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి వారిపై నిషేధం విధించాలని యూపీ ప్రజలను చైతన్య పరుస్తాం. పాలు, నీళ్లు, న్యూస్ పేపర్లు, అద్దెకు ఇళ్లు ఇవ్వొద్దని కోరతాం. జమ్మూకశ్మీర్ బ్యాంకులో ఖాతాలు మూసివేయాలని ఖాతాదారులకు చెబుతాం. మా రాష్ట్రంలో ఉన్న కశ్మీరీలందరూ తిరిగి వెళ్లిపోవాలి. వారు వెళ్లకపోతే ఏప్రిల్ 30 నుంచి ధర్నాలు, ఆందోళన చేపడతామ’ని అమిత్ జానీ పేర్కొన్నారు. -
‘కశ్మీరీల బాధ్యత పాకిస్తాన్ దే’
లాహోర్: భారత్‌తో స్నేహం కుదుర్చుకోవడానికి ప్రయత్నించొద్దని పాకిస్తాన్‌ను జమాత్ –ఉద్ –దవా చీఫ్, 2008లో జరిగిన ముంబై దాడుల ప్రధాన కుట్రదారుడు హఫీజ్ సయీద్ కోరాడు. భారత బలగాలు కశ్మీర్లో అకృత్యాలకు పాల్పడుతున్నాయని ఆరోపించాడు. అక్కడి జనాభా, భౌగోళిక రూపురేఖలను మార్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పాడు. కశ్మీరీల సమస్యలు పరిష్కరించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం చొరవ చూపాలని కోరాడు. ‘స్వాతంత్య్రం కోసం కశ్మీరీలు చేస్తున్న ఉద్యమానికి మా పూర్తి మద్దతు ఉంటుంది. అక్కడ రక్తం చిందుతోంది. వారి సమస్యలు పరిష్కరించే బాధ్యత పాకిస్తాన్ ప్రభుత్వానిదే’ అని సయీద్ అన్నాడు.