'కశ్మీరీలకు భద్రత కల్పించండి' | Rajnath tells all states to ensure safety of Kashmiris | Sakshi
Sakshi News home page

'కశ్మీరీలకు భద్రత కల్పించండి'

Published Fri, Apr 21 2017 12:11 PM | Last Updated on Tue, Sep 5 2017 9:20 AM

'కశ్మీరీలకు భద్రత కల్పించండి'

'కశ్మీరీలకు భద్రత కల్పించండి'

న్యూఢిల్లీ: దేశం నలుమూలలా నివసిస్తున్న కశ్మీరీల భద్రతను కాపాడాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కశ్మీరీలను వేధిస్తున్నారనే ఆరోపణలపై స్పందించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మేరకు ఓ అడ్వైజరీ పంపినట్లు వెల్లడించారు.

మీడియాతో మాట్లాడిన ఆయన దేశంలోని పలు ప్రాంతాల్లో కశ్మీరీలతో కొందరు తప్పుగా ప్రవర్తించారనే విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ మేరకు సూచనలు చేసినట్లు తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో సైన్యంపై రాళ్లు రువ్వడంపై ఉత్తరప్రదేశ్‌, రాజస్ధాన్‌ రాష్ట్రాల్లో ఉన్న కశ్మీరీ విద్యార్థులకు బెదిరింపులు ఎదురయ్యాయనే రిపోర్టులు వచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement