వాషింగ్టన్: అమెరికాలోని పిట్స్‌బర్గ్ పట్టణంలో శనివారం చోటుచేసుకున్న కాల్పుల ఘటన యూదులపై జరిగిన అతిపెద్ద దాడి అని అధికారులు పేర్కొన్నారు. స్క్విరిల్ హిల్స్‌లోని యూదుల ప్రార్థనా మందిరం(సైనగాగ్)లో శనివారం దుండగుడు జరిపిన కాల్పుల్లో 11 మంది మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, గాయపడినవారిలో నలుగురు పోలీసులున్నారని పిట్స్‌బర్గ్ ప్రజా భద్రతా విభాగం డైరెక్టర్ వెండెల్ హిస్రిచ్ వెల్లడించారు. నిందితుడు రాబర్ట్ బోయర్స్(46)పై 29 నేరారోపణల్ని నమోదుచేశారు. యూదులు అమెరికాలో సామూహిక హత్యలకు పాల్పడుతున్నారని, అందుకే వారందర్నీ అంతమొందించాలని అనుకున్నట్లు బోయర్స్ విచారణ సందర్భంగా వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment