ఐఎస్‌ఐఎస్‌ ఖిల్లాలో ఇరాకీ సేనలు! | Iraqi forces 'enter Islamic State Ramadi stronghold' | Sakshi
Sakshi News home page

ఐఎస్‌ఐఎస్‌ ఖిల్లాలో ఇరాకీ సేనలు!

Published Sun, Dec 27 2015 10:19 PM | Last Updated on Sun, Sep 3 2017 2:40 PM

Iraqi forces 'enter Islamic State Ramadi stronghold'

బగ్దాద్‌: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు కీలక ప్రాంతంగా ఉన్న ఇరాక్‌లోని రమాది నగరాన్ని తిరిగి చేజిక్కించుకునేదిశగా ఆ దేశ సేనలు కదులుతున్నాయి. ప్రస్తుతం రమాది నగరంలోకి ఇరాకీ సేనలు ప్రవేశించాయని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. రమాదిలోని ఓ బంగ్లాను తమ అధీనంలోకి తెచ్చుకున్న ఇరాకీ సేనలు నగరం నుంచి ఐఎస్‌ ఉగ్రవాదులను తరిమేసేందుకు దాడిని ముమ్మరం చేశాయని ఆ వర్గాలు తెలిపాయి. ఇరాక్‌ సేనల దాడి తీవ్రతరం కావడంతో ఐఎస్‌ ఉగ్రవాదులు నగరంలోని ఈశాన్య ప్రాంతం దిశగా పరారైనట్టు తెలుస్తున్నది.

సున్నీ అరబ్‌ నగరమైన రమాది నగరం పశ్చిమ బగ్దాద్‌కు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎంతో కీలకమైన ఈ ప్రాంతాన్ని ఐఎస్ ఉగ్రవాదులు గత మేలో చేజిక్కించుకోవడం ఇరాక్‌ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఈ నేపథ్యంలో రమాదిని తిరిగి తన అధీనంలోకి తెచ్చుకోవడానికి ఇరాక్‌ సేనలు గత కొంతకాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. తాజాగా రమాది నగరంపై పట్టు సాధించిన ఇరాకీ సేనలు.. ఐఎస్‌ ఉగ్రవాదులను తరిమేస్తూ ముందుకుసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement