ఐసిస్ చీఫ్‌పై విషప్రయోగం! | IS leader 'poisoned by assassin' | Sakshi
Sakshi News home page

ఐసిస్ చీఫ్‌పై విషప్రయోగం!

Published Tue, Oct 4 2016 3:19 AM | Last Updated on Tue, Sep 18 2018 7:36 PM

ఐసిస్ చీఫ్‌పై విషప్రయోగం! - Sakshi

ఐసిస్ చీఫ్‌పై విషప్రయోగం!

బాగ్దాద్: ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాద సంస్థ అధినేత అబూ బకర్ అల్ బాగ్దాదీపై విష ప్రయోగం జరిగిందని, తీవ్ర అస్వస్థతకు గురయ్యారని మీడియాలో వార్తలు వచ్చాయి. నినెవే జిల్లాలో బగ్దాదీ, మరో ముగ్గురు ఐసిస్ కమాండర్ల హత్యకు కుట్రపన్నిన వ్యక్తి వారికి అందించిన ఆహారంలో విషం కలిపినట్లు డైలీ మెయిల్ పత్రిక సోమవారం తెలిపింది. విషప్రభావంతో ఈ నలుగురు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, వీరిని చికిత్స కోసం గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారని ఇరాక్ వార్తాసంస్థను ఉటంకిస్తూ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement