
ఐఎస్‌ఐఎస్ చీఫ్ అల్ బాగ్దాదీ మృతి!
టెహ్రాన్: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్‌ఐఎస్) అధినేత అబూ బకర్ అల్ బాగ్దాదీ అమెరికా దాడుల్లో అయిన గాయాల వల్ల మృతిచెందాడని ఇరాన్ ప్రభుత్వ రేడియో సోమవారం వెల్లడించింది. అయితే ఈ విషయాన్ని ఐఎస్‌ఐఎస్‌పై దాడులు చేస్తున్న అమెరికా సహా పలు దేశాలు ధ్రువీకరించలేదు. గత నెల ఇరాక్‌లో అమెరికా జరిపిన వైమానిక దాడిలో బాగ్దాదీ గాయపడినట్లు వార్తలు రావడం తెలిసిందే.