
ఈజిప్టు మారణకాండ మా పనే: ఐసిస్
ఇటీవల ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ లో ఆత్మాహుతి దాడికి పాల్పడి 22 మంది అమాయకుల్ని బలిగొన్న ఐసిస్ ఉగ్రవాదులు
కైరో: ఇటీవల ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ లో ఆత్మాహుతి దాడికి పాల్పడి 22 మంది అమాయకుల్ని బలిగొన్న ఐసిస్ ఉగ్రవాదులు.. తాజాగా శుక్రవారం ఈజిప్టులోని ఓ బస్సుపై విరుచుకుపడి 26 మంది క్రైస్తవులను అమానవీయంగా పాశవికంగా హత్యచేశారు. ఈజిస్టు మారణహోమానికి కూడా తమదే బాధ్యతని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ శనివారం వెల్లడించింది. ప్రస్తుతం మృతుల సంఖ్య 29కి పెరిగిందని ఈజిప్టు అధికారులు తెలిపారు.
శుక్రవారం ఈజిప్టు కాప్టిక్ క్రైస్తవులు ప్రయాణిస్తున్న ఓ బస్సుపై సైనిక దుస్తులు ధరించిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డ విషయం తెలిసిందే. మిన్య నగరం సమీపంలో జరిగిన ఈ మారణకాండలో 26 మంది క్రైస్తవులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా మంది గాయపడ్డారు.