లాహోర్ః కశ్మీర్ అల్లర్ల నేపథ్యంలో గాయపడిన వారికి మందులు, వైద్య చికిత్స అందించేందుకు పారామెడికల్ సిబ్బందితో కూడిన పాక్ వైద్య బృందం కశ్మీర్ చేరేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో హఫీజ్ సయీద్ నేతృత్వంలోని 30 మంది సభ్యులు భారత్ పర్యటనకు వీసాలకోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ముస్లిం మత సంబంధిత మెడికల్ మిషన్.. జమాత్-ఉద్-దవా (జుద్) కు చెందిన 30 మంది వైద్య సిబ్బంది భారత్ వీసాలకు సన్నాహాలు చేస్తున్నారు. జమ్ము కశ్మీర్ ఘర్షణల్లో భారత సైన్యం చేతిలో గాయపడ్డవారికి చికిత్స అందించేందుకు వారు మంగళవారం కశ్మీర్ చేరే ప్రయత్నంలో ఉన్నారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ అనంతరం జమ్ము కశ్మీర్ లో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో ఎక్కువమందికి కళ్ళకు గాయాలవ్వడంతో వారికి చికిత్స అందించేందుకుగాను కశ్మీర్ బయల్దేరుతున్న బృందంలో కంటి నిపుణులను సైతం తీసుకువెడుతున్నట్లు 'జుద్' కు చెందిన అధికారి అహ్మద్ నదీమ్ తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో జుద్ వైద్య బృందాన్ని ఇస్లామాబాద్ లోని భారత రాయబార కార్యాలయం ఎలా అనుమతిస్తోంది? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ముస్లిం మెడికల్ మిషన్ తన వంతు సహాయం అందించడంలో భాగంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి తాము విజ్ఞప్తి చేశామని నదీమ్ తెలిపారు. అయితే గాయపడిన కాశ్మీరీలకు చికిత్స అందించేందుకు తమ బృదం రాకూడదంటూ భారత వైద్య బృదం..తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు మిషన్ ప్రెసిడెండ్ ప్రొఫెసర్ డాక్టర్ జాఫర్ ఇక్బాల్ చౌదరి తెలిపారు. గాయపడినవారికి భారత ప్రభుత్వం పూర్తిశాతం వైద్య చికిత్స అందించకపోవడంతోనే తమ బృదం భారత్ కు బయల్దేరాల్సి వస్తోందని తెలిపారు. గాయపడ్డవారికి పూర్తి శాతం చికిత్స అందించకుండానే భారత వైద్య బృందం శ్రీనగర్ నుంచీ తిరిగి వెళ్ళిపోయిందని ఆరోపించిన ఇక్బాల్ చౌదరి.. కశ్మీరీలకు చికిత్స అందించడం తమ విధిగా భావిస్తున్నామని తెలిపారు.
భారత్ వీసాకు పాక్ బృందం దరఖాస్తు!
Published Mon, Jul 25 2016 5:09 PM | Last Updated on Mon, Aug 20 2018 3:21 PM
Advertisement
Advertisement