అయ్య బాబోయ్.. ఇలా కూడా చంపుతారా.. | Man takes road rage to a new level, uses car to attack, kill men | Sakshi
Sakshi News home page

అయ్య బాబోయ్.. ఇలా కూడా చంపుతారా..

Published Mon, Jun 27 2016 10:54 AM | Last Updated on Mon, Sep 4 2017 3:33 AM

అయ్య బాబోయ్.. ఇలా కూడా చంపుతారా..

అయ్య బాబోయ్.. ఇలా కూడా చంపుతారా..

కొన్ని దారుణాలు చూసేందుకే ధైర్యం చాలదు.. అలాంటిది స్వయంగా చేయాలంటే ఎంతటి ధైర్యం కావాలి. ఒకరిని కాదు.. మొత్తం ముగ్గురుని.. కక్షకట్టి పగబట్టి ఏ కోశానా భయం లేకుండా చంపడమే లక్ష్యంగా ఓ వ్యక్తి కారుతో తెగబడితే..

హాంగ్కాంగ్: కొన్ని దారుణాలు చూసేందుకే ధైర్యం చాలదు.. అలాంటిది స్వయంగా చేయాలంటే ఎంతటి ధైర్యం కావాలి. ఒకరిని కాదు.. మొత్తం ముగ్గురుని.. కక్షకట్టి పగబట్టి ఏ కోశానా భయం లేకుండా చంపడమే లక్ష్యంగా ఓ వ్యక్తి కారుతో తెగబడితే.. అది కూడా పట్టపగలు నడిరోడ్డుపై.. బిజీగా ఉండే చౌరస్తాలో.. నాలుగు వైపుల వాహనాల రద్దీ ఉండగా.. ఈ ఒళ్లు గగుర్పొడిచే ఘటన హాంకాంగ్లో చోటుచేసుకుంది. బిజీగా ఉండే చౌరస్తాలో ఓ బ్లూ ట్యాక్సీ కారుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.

అందులో ఒక మహిళ కూడా ఉంది. ఆ మహిళ లోపలే కూర్చుని ఉండగా ఓ బ్లాక్ టీషర్ట్ వేసుకున్న వ్యక్తి మరో యువకుడు ఆ కారుపక్కనే నిల్చున్నారు. అదే సమయంలో వారి వెనుకాలే ఓ తెల్లటి కారు వారిపైకి దూసుకొచ్చింది. ఉద్దేశ పూర్వకంగా కారుతో సహా వారిని ఢీకొట్టింది. అందులో ఒకతను కారు కిందపడగా కారులోని మహిళ, మరో యువకుడు బయటకు వచ్చారు. అప్పటికీ వదిలిపెట్టని ఆ తెల్లటికారులోని వ్యక్తి ఆ ముగ్గురి అంతమే లక్ష్యంగా కారుతో పదే పదే గుద్దేసేందుకు చౌరస్తాలో చక్కెర్లు కొడుతూ ప్రయత్నించాడు. మహిళను ఢీకొట్టేందుకు ప్రయత్నించగా మరో కారు వచ్చి అతడిని అడ్డుకుంది.

అయితే దానిని కూడా ఢీకొట్టి అంతటితో ఆగకుండా చౌరస్తా మొత్తం హడలెత్తెలా చక్కెర్లు కొడుతూ అక్కడి వారిని చంపేసేందుకు విఫలయత్నం చేశాడు. ఈ కారు ఢీకొన్న కారణంగా ఒక వ్యక్తి కొన ఊపిరితో కొట్టుకునే పరిస్థితికి వెళ్లగా మరో వ్యక్తి బతికి బయటపడ్డాడు. మహిళకు మాత్రం ఎలాంటి హానీ జరగలేదు. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ సీసీటీవీ ఫుటేజీని తాజాగా పోలీసులు విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement