బాబోయ్ ఇంత పొడుగు పేరా?
Published Mon, Jul 7 2014 4:50 PM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM
ఆయన పేరు పలకడం ఆయనకే సాధ్యం కాదు. ఆయన పేరు కొండవీటి చాంతాడంత పొడుగు మరి! స్వీడెన్ కి చెందిన ఈ పాతికేళ్ల కుర్రాడి పేరు కంఠతా పట్టడానికి ఓ వారం పడుతుందేమో.
ఒక సారి ట్రై చేయండి చూద్దాం. కిమ్ జాంగ్ సెక్సీ గ్లోరియస్ బీస్ట్ డివైన్ డిక్ ఫాదర్ లవ్వీ ఐరన్ మాన్ ఈవెన్ యూనిక్ పో ఉన్న విన్ చార్లీ ఘోరా ఖావోస్ మెహన్ హంసా కిమ్మీ హుంబెరో ఉనో మాస్టర్ ఓవర్ డాన్స్ షేక్ బౌటీ బెపోప్ రాక్ స్టెడీ ష్రెడ్డర్ కుంగ్ ఉల్ఫ్ రోడ్ హౌస్ గిలగామేశ్్ ఫ్లాప్ గై థిరో ఏ హెచ్ ఇమ్ యోడా ఫంకీ బాయ్ స్లామ్ డక్ చుక్ జోర్కా జుక్కా పెక్కా ర్యాన్ సూపర్ ఎయిర్ ఓయ్ రస్సెల్ సాల్వడోర్ ఆల్ఫోన్స్ మోల్గన్, అక్తా పాపా లాంగ్ నమే ఎక్.
అయితే అందరూ అతడిని పాపా లాంగ్ నామే అని పిలుస్తారు. ఆయన పేరులో 63 పదాలున్నాయి. ఇప్పటికిదే ప్రపంచ రికార్డు. ఇంత వరకూ పొడుగు పేరున్న వీరుడి పేరు బార్నబీ మార్మడ్యూక్ అలోయ్ సియస్ బెంజీ కాబ్ వెబ్ డార్టగ్నన్ ఎగ్బర్ట్ ఫెలిక్స్ గాస్పర్ హెంబర్ట్ ఇగ్నేషియస్ జేడెన్ కాస్పర్ లెరాయ్ మాక్స్ మిలన్ నెడ్డీ ఓబియాజులు పెపిన్ క్విల్లియమ్ రోసెన్ కాంట్జ్ సెక్స్ టన్ డెడ్డీ అప్ వుడ్ వివాత్మా వేలాండ్ జైలోన్ యార్డ్ లీ జకారీ ఉసాన్ స్కీ. ఆయనది ఇంగ్లండ్ .
Advertisement
Advertisement