ధూమ్ ధామ్ పార్టీ ఇచ్చిన కిమ్
టోక్యో: ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మంచి మూడ్‌లో ఉన్నారట. ఖండాంతర క్షిపణి పరీక్ష విజయవంతమైన తర్వాత దాన్ని తయారు చేసేందుకు కృషి చేసిన వారందరికీ ధూమ్ ధామ్ పార్టీ ఇచ్చారట కిమ్. అంతేకాదు తానూ పార్టీకి హాజరయ్యి పాప్ మ్యూజిక్‌ను విన్నారట. ఈ మేరకు ఉత్తరకొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ఓ రిపోర్టును ప్రచురించింది.
కన్సర్ట్‌లో సాంగ్ ఆఫ్ హ్వాసంగ్ రాకెట్, మేక్ అదర్స్ ఎన్వీ అజ్ అనే గీతాలను కూడా ప్లే చేసినట్లు తెలిపింది. కన్సర్ట్‌లో నృత్యం చేసేందుకు మహిళల బ్యాండ్‌ను కిమ్ ఎంపిన చేశారని.. కిమ్ హయాంలో ఇలాంటి చర్య గతంలో ఎన్నడూ జరగలేదని వివరించింది. జులై 4వ తేదీన జరిపిన హ్వాసంగ్-14 క్షిపణి ప్రయోగాన్ని ఉత్తరకొరియా ప్రతిష్టాత్మక విజయంగా భావిస్తోంది.
పరీక్ష విజయాన్ని జాతి విజయంగా ఆ దేశం భావిస్తున్నట్లు ప్రముఖ పత్రికల్లో కథనాలు కూడా వెలువడ్డాయి. కాగా, ఆదివారం జరిగిన కన్సర్ట్‌కు హాజరైన వారిలో యూనిఫాంలో ఉన్న వ్యక్తులు కూడా డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు.