
వాషింగ్టన్: అంతరిక్ష చరిత్రలో మరో ఖ్యాతి మానవుడి ఖాతాలో చేరింది. అయితే ఈసారి దీనిని ఖ్యాతి అనే కంటే అపఖ్యాతి అంటే బాగుంటుందేమో. ఎందుకంటారా.. ఇంతవరకు భూమి మీద సాధ్యమైన ఓ విషయాన్ని మొట్టమొదటిసారి అంతరిక్షంలో మనిషి చేసి చూపించాడు. ఇంతకూ అదేమిటి అనుకుంటున్నారా..? అదేనండీ భూమి మీద బాగా పెరిగిపోయిన ‘నేరం’. ఏంటీ నమ్మలేకపోతున్నారా.. అయితే చదివేయండి.
నాసా అంతరిక్ష కార్యక్రమంలో భాగంగా అన్నె మెక్‌క్లెయిన్ అనే మహిళా వ్యోమగామి సుమారు 6 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో గడిపారు. ఆమెకు భూమి మీద సమ్మర్ వోర్డన్స్ అనే ‘భార్య’ఉన్నారు. వోర్డన్స్‌కు తెలియకుండా ఆమె వ్యక్తిగత ఆర్థిక పత్రాలు, బ్యాంకు ఖాతాలను క్లెయిన్ ఐఎస్‌ఎస్‌లో ఉన్నపుడు వినియోగించారు. దీంతో వోర్డన్స్ ఈ ఏడాది ప్రారంభంలో ఫెడరల్ ట్రేడ్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వోర్డన్స్ కుటుంబసభ్యులు ఇదే నేరంపై క్లెయిన్ మీద నాసా విభాగంలోనూ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ నేరం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలోని ఇన్‌స్పెక్టర్ జనరల్ దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment