
ప్రతీకాత్మక చిత్రం
మాస్కో : రాజ్యాంగంలో నూతన సవరణల దిశగా రష్యా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. స్త్రీ, పురుషుల ఇష్ట ప్రకారం శారీరకంగా కలిస్తే.. అధికారికంగా పెళ్లి జరిగినట్లే అని ఆ దేశ రాజ్యాంగం గుర్తించనుంది. ఈ మేరకు రష్యా తన రాజ్యాంగంలో కొత్త సవరణ తీసుకురానుంది. ఈ వివాహాన్ని హెటిరోసెక్సువల్ యూనియన్‌గా గుర్తించినట్లు ఆ దేశ ప్రతినిధులు చెప్పారు. అలాగే దేవుడు అనే పదాన్ని కూడా కొత్త సవరణలతో రాజ్యాంగంలో చేర్చనున్నారు. రాజ్యాంగ సవరణల నేపథ్యంలో దేశ అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ 24 పేజీల సవరణలను పార్లమెంట్‌కు సమర్పించారు.
మొత్తం సమాజంలోని అన్ని వర్గాలతో చర్చలు జరిపిన తర్వాతే ఈ మార్పులకు శ్రీకారం చుట్టినట్లు ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ వచస్లేవ్ వోలోడిన్ తెలిపారు. మరోవైపు స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్దం చేసే ప్రసక్తే లేదని ఇటీవల పుతిన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. నూతన రాజ్యాంగ సవరణల బిల్లుపై మార్చి 10న పార్లమెంట్‌లో చర్చించనున్నారు. ఏప్రిల్ 22న ఓటింగ్ జరుగనుంది. కాగా సెక్యూలర్ దేశమైన రష్యాలో అధికశాతం సాంప్రదాయ క్రిస్టియన్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment