షుగర్.. నో ఫికర్
మధుమేహంతో చాలామంది పడరాని పాట్లు పడుతుంటారు. అలాంటి వారికి యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ శాస్త్రవేత్తలు ఓ శుభవార్త చెబుతున్నారు. ఓ ప్రత్యేక విధానం ద్వారా ఇన్సు లిన్‌ను ఉత్పత్తి చేసే క్లోమకణాల సంఖ్యను గణ నీయంగా పెంచగలిగామని, తద్వారా శరీరంలో ఈ వ్యాధి అన్నదే లేకుండా చేయగలిగా మంటున్నారు. ప్రస్తుతానికి ఇది టైప్–1 మధు మేహులకు పూర్తి స్థాయిలో వ్యాధిని నయం చేస్తుందని, టైప్–2 వారికి ఇన్సులిన్‌ను తీసుకోవాల్సిన అవసరాన్ని తగ్గిస్తుందని పరిశోధనల్లో పాలు పంచుకున్న శాస్త్రవేత్తలు బ్రూనో డోరియన్, రాల్ఫ్ డిఫ్రోన్జోలు తెలిపారు.
ఈ పద్ధతిని ఎలుకలపై ప్రయోగించి విజయవంతమయ్యాయని, ఏడాది పాటు ఈ వ్యాధి రాకుండా అడ్డుకోగలిగామన్నారు. క్లోమ గ్రంథిలో బీటా కణాలతో పాటు ఇతర కణాలు కూడా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసేలా మార్చామని చెప్పారు. దీంతో రక్తంలోని గ్లూకోజ్ మోతాదును నియంత్రించగలిగామని వివరించారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ శాస్త్రవేత్తలు ఒక వైరస్‌ను వాహకంగా వాడుకుని క్లోమ కణాలకు కొన్ని జన్యువులను అందజేశారు. దీంతో బీటా కణాలు కానివి కూడా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయడం మొదలుపెట్టాయని డిఫ్రోన్జో పేర్కొన్నారు.