రన్‌వే కాదు.. హైవే | No runway .. Highway | Sakshi
Sakshi News home page

రన్‌వే కాదు.. హైవే

Published Mon, May 26 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 7:50 AM

రన్‌వే కాదు.. హైవే

రన్‌వే కాదు.. హైవే

బీజింగ్: చైనా వాయుసేనకు చెందిన ఈ యుద్ధవిమానం టేకాఫ్ అవుతున్నది విమానాశ్రయం రన్‌వేపై కాదు. మధ్య చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో ఉన్న ఝెంగ్‌ర-మిన్‌క్వాన్ హైవేపై. ఆదివారం చైనా ఎయిర్‌ఫోర్స్ తొలిసారిగా యుద్ధవిమానాలను ఇలా హైవేపై ప్రయోగాత్మకంగా పరీక్షించింది.

చైనాలోని అత్యుత్తమ రహదారుల్లో ఒకటైన ఈ హైవేను పౌర, రవాణా విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లకు ప్రత్యామ్నాయ విమానాశ్రయంగా కూడా ఉపయోగించవచ్చని సైన్యాధికారులు వెల్లడించారు. యుద్ధం, అత్యవసర సమయాల్లో యుద్ధవిమానాలను సైతం ఈ హైవేపై సురక్షితంగా దింపగలిగేలా చైనా వాయుసేన ఈ పరీక్షల ద్వారా సత్తా చాటిందని తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement