
క్వాంగ్‌యాంగ్‌సాంగ్-4 ఉపగ్రహ ప్రయోగ చిత్రం
సియోల్ : వరుస అణు పరీక్షలతో అణు సాయుధ సంపత్తిని సొంతం చేసుకున్న ఉత్తరకొరియా తర్వాతి లక్ష్యం వరుసగా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడమేనా?. ఇదే విషయాన్ని దక్షిణ కొరియా ఇంటిలిజెన్స్ చెబుతున్న అంశాలు బలాన్ని చేకూర్చుతున్నాయి.
తమకూ ఉపగ్రహాలను ప్రయోగించే హక్కుందంటూ ఉత్తరకొరియా అధికార పత్రిక కథనం ప్రచురించడం ఈ వార్తలను మరింత ధ్రువపరుస్తోంది. క్వాంగ్‌యాంగ్‌సాంగ్-5 అనే ఉపగ్రహాన్ని ఉత్తరకొరియా త్వరలో ప్రయోగించనున్నట్లు దక్షిణ కొరియా పత్రిక ఒకటి పేర్కొంది.
అణు పరీక్షలతో ఐక్యరాజ్యసమితి ఆంక్షల వల్ల కిమ్ దేశం ఉపగ్రహ ప్రయోగాలు చేయడానికి అనుమతి లేదు. ఆంక్షలను బేఖాతరు చేస్తూ.. భారీగా కెమెరాలు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలను అమర్చిన ఉపగ్రహాన్ని ఆర్బిట్‌లో ప్రవేశపెట్టడానికి ఉత్తరకొరియా సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
గత ఏడాది ఫిబ్రవరిలో క్వాంగ్‌యాంగ్‌సాంగ్-4 ఉపగ్రహాన్ని కిమ్ దేశం విజయవంతంగా ప్రయోగించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో యూఎన్ సమావేశంలో మాట్లాడిన కిమ్ దేశ ప్రతినిధి ఉత్తరకొరియా ప్రజల సంక్షేమం కోసం, ఆర్థిక ప్రగతి కోసం ఉపగ్రహ ప్రయోగాలను చేయనుందని చెప్పారు. దీన్ని బట్టి కిమ్ జాంగ్ ఉన్ 2016-2020ల మధ్య వరుస ఉపగ్రహ ప్రయోగాలను చేపట్టే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment