ఆఫ్రికాలో ఇబోలా వైరస్‌వ్యాప్తిపై ఒబామా ఆందోళన | obama worries over ibola virus spread in africa | Sakshi
Sakshi News home page

ఆఫ్రికాలో ఇబోలా వైరస్‌వ్యాప్తిపై ఒబామా ఆందోళన

Published Sun, Aug 3 2014 2:36 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

ఆఫ్రికాలో ఇబోలా వైరస్‌వ్యాప్తిపై ఒబామా ఆందోళన - Sakshi

ఆఫ్రికాలో ఇబోలా వైరస్‌వ్యాప్తిపై ఒబామా ఆందోళన

వాషింగ్టన్: పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ప్రాణాంతక ఇబోలా వైరస్ వ్యాప్తిచెందుతుండటంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. గతంతో పోలిస్తే ఈ వైరస్ వ్యాప్తి తీవ్రత పెరిగినందున తాము ఎంతో అప్రమత్తతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే వారం తమ దేశంలో జరగనున్న ఆఫ్రికా-అమెరికా సదస్సులో పాల్గొనేందుకు 50 దేశాల ప్రతినిధులు రానున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఆయా దేశాల ప్రతినిధులు స్వదేశాల నుంచి బయలుదేరే ముందు ఒకసారి, అమెరికాకు చేరుకున్నాక మరోసారి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.మరోవైపు పశ్చిమ ఆఫ్రికాలో ఈ వైరస్ బారినపడిన తమ దేశానికి చెందిన ఇద్దరు పౌరులను స్వదేశానికి రప్పించి చికిత్స అందించేందుకు అమెరికా ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని పంపింది.

ఆ అనుమానితులను హింసించడం నిజమే

సెప్టెంబర్ 11 ఉగ్రవాద దాడుల తర్వాత కొందరు అనుమానితులను విచారణ సందర్భంగా సీఐఏ హింసించినమాట నిజమేనని ఒబామా అంగీకరించారు. 9/11 దాడి తర్వాత అదుపులోకి తీసుకున్న అనుమానిత మిలిటెంట్లను హింసించడానికి ఎలాంటి పద్ధతులు వాడారన్న అంశంపై తమ ప్రభుత్వం త్వరలో ఒక నివేదికను విడుదల చేయనుందని ఆయన చెప్పారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement