ఈబేలో అమ్మకానికి పాక్ ప్రధాని షరీఫ్
లండన్: ‘పనికిరాని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్’ అంటూ ఆయనను ఒకరు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు. ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఈబేకు చెందిన లండన్ పేజీలో షరీఫ్ విక్రయానికి ప్రకటన ఇచ్చారు. 66,200 బ్రిటన్ పౌండ్ల(దాదాపు రూ.62లక్షలు)కు కొనుక్కోవచ్చన్న పోస్ట్‌కు దాదాపు 100 బిడ్లు కూడా వచ్చాయి. షరీఫ్ పేరుతో పెట్టిన పోస్ట్‌లో.. ‘కొత్త బ్రాండ్, ఇంతవరకు వాడని సరికొత్త వస్తువు’ అని అడ్వర్ట్‌టైజ్‌మెంట్‌లో వివరించారు. ‘పాక్‌లోకంటే ఇంగ్లాండ్, అమెరికా, టర్కీ దేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తారు.
వ్యాపారాలు, ఆస్తులు అన్నీ లండన్‌లో ఉంటాయిగానీ పాక్‌కు ప్రధానిగా ఉండేందుకు ఇష్టపడతారు.’ అని పోస్టులో ఉంది. ‘ఈ వస్తువుకు పుట్టుకతోనే జన్యులోపముంది. ఇప్పుడే కొన్నవారు వెంటనే ఈరోజే లండన్‌లో వస్తువును తీసుకోవచ్చు. దీన్ని కొంటే షరీఫ్ తమ్ముడు షాబాజ్‌ను ఉచితంగా ఇస్తాం’ అని ప్రకటనలో ఉంది. కొద్దిసేపటికి ఈ పోస్టును ఈబే నుంచి తొలగించారు.