ఇస్లామాబాద్: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్తాన్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇమ్రాన్ వ్యాఖ్యలను ఆ దేశానికే చెందిన ముత్తహిదా కౌమి మూవ్‌మెంట్ వ్యవస్థాపకుడు ఆల్తారీ హుస్సేన్ తీవ్రంగా ఖండించారు. కశ్మీర్‌పై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని తన మద్దతు ప్రకటించారు.
హుస్సేన్ ఆదివారం తన మద్దతుదారులతో ఓ సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఆశ్చర్యకరంగా ఈ సమావేశంలో ‘సారే జహాసే అచ్చా’ గేయాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశ ప్రజలను రెచ్చగొట్టేందుకే ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ అంశంపై మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పాక్ ఆర్మీని రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు. కశ్మీర్‌పై ఆయన తీరు మార్చుకోవాలి. పాక్ ఆర్మీ ఇమ్రాన్ చెప్పినట్లు వ్యవహరిస్తోంది. కశ్మీర్ అంశంపై పూర్తిగా భారత్ అంతర్గత అంశం. దీనిలో ఏ దేశామూ జోక్యం చేసుకోరాదు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment