
‘అంతా టచ్‌లో ఉన్నారు.. మేం వస్తాం’
ఇస్లామాబాద్: చాలా కాలం తర్వాత పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ రాజకీయ అంశాన్ని మాట్లాడారు. తిరిగి తాను పాక్ రాజకీయాల్లో మెరవబోతున్నట్లు లీకులిచ్చారు. ఇప్పటికే తనతో పాక్‌లోని ప్రముఖ రాజకీయ నాయకులంతా తనకు అనుబంధంగానే ఉంటూ ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నారన్న ఆయన త్వరలోనే పాక్‌లోకి మూడో రాజకీయ కూటమి వస్తుందని చెప్పారు. ఆ కూటమే పాక్ ప్రజల సమస్యలన్నింటిని తీరుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
త్వరలోనే ఆయన పార్టీ దేశ వ్యాప్త రాజకీయాల్లోకి ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా వెళుతుందని, అతడు తీసుకురాబోమే ప్రగతి, సంస్కరణల అజెండాలను ప్రజలకు తెలియజేస్తుందని చెప్పారు. ప్రస్తుతం పాక్ సంక్షోభంలో ఉందని, అందులో నుంచి బయటపడేయడమే తమ ముందున్న లక్ష్యం అని తెలిపారు. మంచి ప్రభుత్వాలు రాకుంటే పేదరికం అలాగే ఉండిపోతుందనే విషయం ప్రజలకు అర్థమయ్యేలా చెబుతామని స్పష్టం చేశారు.