'నా భార్య కనిపించే వరకు పోరాడుతా' | Rescuers in Taiwan pulled a young man alive from a collapsed apartment | Sakshi
Sakshi News home page

'నా భార్య కనిపించే వరకు పోరాడుతా'

Published Sun, Feb 7 2016 5:33 PM | Last Updated on Sun, Sep 3 2017 5:08 PM

'నా భార్య కనిపించే వరకు పోరాడుతా'

'నా భార్య కనిపించే వరకు పోరాడుతా'

తైవాన్: 'నేను నా భార్యకోసం చూస్తున్నాను. ఆమెను గుర్తించేవరకు అలసిపోను' ఇవి తైవాన్లో భూకంపం బారినపడి కుప్పకూలిపోయిన భవంతి శిథిలాలకింద తన భార్యను గాలిస్తున్న ఓ వ్యక్తి మాటలు. తైవాన్ లో భారీ భూకంపం సంభవించి ఓ పెద్ద భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ భవనం శిథిలాలను తొలగించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం కొన ప్రాణంతో తల్లడిల్లుతున్న ఓ వ్యక్తిని సురక్షితంగా బయటకు తీశారు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మరో 130మంది శిథిలాల కిందే ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

24గంటలుగా సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆదివారం హువాంగ్ కువాంగ్ వెయ్ అనే వ్యక్తిని బయటకు తీశారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, సైనికులు, స్వచ్ఛంద సేవకులు, స్థానికులు శిథిలాలను తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు. సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ వ్యక్తి ఉద్వేగంగా మాట్లాడుతూ'ఆమె నా ఫోన్ కాల్స్ కు స్పందించడంలేదు. నేను నా ఎమోషన్స్ను నిలువరించుకొని స్తిమితంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. ఆమెను గుర్తించేవరకు నేను పోరాడుతునే ఉంటాను' అని తన భార్యను శిథిలాల కింద కోల్పోయిన ఓ వ్యక్తి భావోద్వేగంతో అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement