పాల్ఘర్: విద్యా వ్యవస్థలోని లోటుపాట్లు, జాప్యంతో విరక్తి చెందిన మహారాష్ట్ర యువతి తన ప్రాణాలు తీసుకోవడానికి అనుమతించాలని రాష్ట్ర విద్యా మంత్రి వినోద్ తావ్డేను అనుమతి కోరుతూ లేఖ రాసింది. పాల్ఘర్‌కు చెందిన ఆ యువతిని కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వనందుకు బీఫార్మసీ కాలేజీ యాజమాన్యం పరీక్షలకు అనుమతించలేదు. చివరకు సర్టిఫికెట్ తెస్తే ఆలస్యమైందంటూ కోర్సును మళ్లీ మొదటి నుంచి చదవాలని యూనివర్సిటీ సూచించడంతో ఆవేదనతో లేఖ రాసింది.