అమెరికా అధ్యక్షుడిగా కార్యాలయంలో బాధ్యతలు తీసుకునే రోజే (జనవరి 20) ట్రాన్‌స పసిఫిక్ పార్టనర్‌షిప్ (టీపీపీ) నుంచి వైదొలుగుతామని కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా కార్యాలయంలో బాధ్యతలు తీసుకునే రోజే (జనవరి 20) ట్రాన్‌స పసిఫిక్ పార్టనర్‌షిప్ (టీపీపీ) నుంచి వైదొలుగుతామని కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద వాణిజ్య ఒప్పందమైన టీపీపీలో అమెరికా భాగస్వామి కావడం భారీ తప్పిదమన్నారు. అమెరికన్ల ఉద్యోగాలకు ఎసరు పెడుతున్న వర్క్ వీసాల దుర్వినియోగాలపై కూడా విచారణ జరుపుతానని హామీనిచ్చారు. శ్వేతసౌధంలో తన తొలి 100 రోజుల విధాన ప్రణాళికలను ఆయన సంక్షిప్తంగా వివరించారు.
వాణిజ్యం, ఇంధనం, శాసనం, జాతీయ భద్రత, వలసలు, నైతిక విలువలు వంటివాటిపై దృష్టిపెట్టి అమెరికాను అగ్రస్థానంలో నిలబెడతానన్నారు. మీడియా ప్రతినిధులను ప్రత్యేక సమావేశానికి పిలిచిన ట్రంప్ అక్కడ వారిపై ‘మీరంతా నిజారుుతీ లేని, మోసపూరితంగా అబద్ధాలు ఆడే వారు’ అని విరుచుకుపడ్డారు. ఇదిలా ఉండగా అమెరికా కాంగ్రెస్‌లో తొలి హిందూ సభ్యురాలైన తులసీ గబార్డ్ సోమవారం ట్రంప్‌తో భేటీ అయ్యారు. ట్రంప్ ఉగ్రవాద నిరోధానికి కొత్త ఆలోచనలు ముందుకు తీసుకొచ్చే అవకాశముందనీ, ఆయన శాంతిభద్రతలను పరిక్షించగలరని బీజేపీ సీనియర్ నేత రాం మాధవ్ వాషింగ్టన్‌లో పేర్కొన్నారు.