వాషింగ్టన్ : ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. కిమ్ ఆరోగ్యంపై ప్రపంచ మీడియా తప్పుడు వార్తలను ప్రచురితం చేస్తోందని అన్నారు. ఆయనపై ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ తప్పుడువని కొట్టిపారేశారు. ఈ మేరకు గురువారం వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ట్రంప్ కిమ్ ఆరోగ్యంపై స్పందించారు. దీనిపై ఉత్తర కొరియా నుంచి ఎలాంటి ప్రకటన రాలేదని అప్పటి వరకూ ఇలాంటి వార్తలను నమ్మడానికి లేదని స్పష్టం చేశారు. సీఎన్‌ఎన్ సహా పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కిమ్ ఆరోగ్యం విషమించిందంటూ వెలువరించిన కథనాలు ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. (విషమంగా కిమ్ జోంగ్ ఆరోగ్యం..!)
కాగా కిమ్ త్వరగా కోలుకోవాలని మొదట్లో ట్రంప్ ఆకాక్షించిన విషయం తెలిసిందే. కాగా కిమ్‌జాంగ్ ఆరోగ్యం పూర్తిగా ఉందంటూ గతపది రోజుల నుంచి పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. వేడుకగా జరిగే తన తాత జయంతి ఉత్సవాలకు కూడా కిమ్ రాకపోవడంతో వదంతులకు బలం చేకూరింది. విపరీతంగా పొగ తాగడం, స్థూలకాయం, అధిక పనిభారం వల్ల ఆగస్టులోనే కిమ్ అనారోగ్యానికి గురయ్యారని తెలుస్తోంది. అయితే దీనిపై స్థానిక ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment