'ప్రెస్ కాన్పరెన్స్లోనే కాల్చి చంపారు' | Turkish human rights lawyer shot dead during press conference | Sakshi
Sakshi News home page

'ప్రెస్ కాన్పరెన్స్లోనే కాల్చి చంపారు'

Nov 29 2015 6:49 PM | Updated on Sep 3 2017 1:13 PM

'ప్రెస్ కాన్పరెన్స్లోనే కాల్చి చంపారు'

'ప్రెస్ కాన్పరెన్స్లోనే కాల్చి చంపారు'

టర్కీలో ఓ ముఖ్యమైన న్యాయవాది, మానవహక్కుల కార్యకర్త హత్యకు గురయ్యాడు. విలేకరుల సమావేశం నిర్వహిస్తుండగానే ఆ న్యాయవాదిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి చంపేశారు.

టర్కీ: టర్కీలో ఓ ముఖ్యమైన న్యాయవాది, మానవహక్కుల కార్యకర్త హత్యకు గురయ్యాడు. విలేకరుల సమావేశం నిర్వహిస్తుండగానే ఆ న్యాయవాదిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి చంపేశారు. ఈ క్రమంలో పోలీసులకు, ఓ జర్నలిస్టుకు కూడా గాయాలయ్యాయి. తాహిర్ ఎల్సి అనే న్యాయవాది ఖుర్దిష్ తిరుగుబాటుదారులకు మద్దతుదారు. దీంతో ఆయనపై క్రిమినల్ అభియోగాలు కూడా ఉన్నాయి.

శనివారం ఏదో అంశంపై తోటి న్యాయవాదులతోకలిసి పత్రికా విలేకరుల సమావేశం నిర్వహిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అకస్మాత్తుగా వచ్చి ఈ దాడికి దిగారు. అయితే, ఈ దాడి ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. తాహిర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండటంతోపాటు ఖుర్దిష్ నగరంలోని ప్రముఖ హక్కుల కార్యకర్తగా కూడా పనిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement