ఎయిర్పోర్ట్లో పేలుడు : ఇద్దరికి గాయాలు | Two injured in Istanbul airport blast | Sakshi
Sakshi News home page

ఎయిర్పోర్ట్లో పేలుడు : ఇద్దరికి గాయాలు

Published Wed, Dec 23 2015 1:46 PM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM

ఎయిర్పోర్ట్లో పేలుడు : ఇద్దరికి గాయాలు - Sakshi

ఎయిర్పోర్ట్లో పేలుడు : ఇద్దరికి గాయాలు

ఇస్తాంబుల్ : టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్లో బుధవారం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి... వైద్య చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. క్షతగాత్రులు ఇద్దరు ఎయిర్పోర్ట్ను శుభ్రం చేస్తున్న క్రమంలో ఈ పేలుడు సంభవించిందని తెలిపారు. ఈ పేలుడు ఆర్థరాత్రి 2.00 గంటల ప్రాంతంలో పేలిందని పేర్కొన్నారు. ఈ పేలుడు కూతవేటు దూరంలో విమానం ఆగి ఉందన్నారు. అయితే ఈ పేలుడుకు గల కారణాలు తెలియరాలేదని... దీనిపై దర్యాప్తునకు ఆదేశించామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement