‘అల్లా’ అంటే.. ఉగ్రవాది అయిపోతాడా..? | US Teacher Calls Police After Six-Year-Old Says "Allah" In Class | Sakshi
Sakshi News home page

‘అల్లా’ అంటే.. ఉగ్రవాది అయిపోతాడా..?

Published Mon, Dec 4 2017 11:20 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM

 US Teacher Calls Police After Six-Year-Old Says "Allah" In Class - Sakshi

టెక్సాస్‌: అమెరికాలోని ఓ పాఠశాల తరగతి గదిలో ఆరేళ్ల ముస్లిం బాలుడు ‘అల్లా బూమ్‌’ అని అరవడంతో అదే క్లాస్‌లో పాఠాలు చెబుతున్న టీచర్‌ పోలీసులకు కాల్ చేశారు. ఈ సంఘటన టెక్సాస్‌లోని పియర్లాండ్‌ ఎలిమెంటరీ స్కూల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బుద్ది మాంద్యంతో బాధపడుతున్న మహ్మద్‌ సులేమాన్‌ తరగతి గదిలో ఆకస్మాత్తుగా అల్లా బూమ్‌ అని గట్టిగా అరిచాడు. దీంతో భయాందోళనకు గురైన టీచర్‌ ఆ బాలుడ్ని ఉగ్రవాదిగా భావించి పోలీసులకు సమాచారం అందించారు.

అయితే బాలుడి తండ్రి మాత్రం తన కొడుకు బుద్ధి మాంద్యంతో బాధపడుతున్నాడని, సరిగ్గా మాట్లడలేడని తెలిపారు. ఈ విషయం రోజు వచ్చే టీచర్‌కు తెలుసని. ఆ రోజు వేరే టీచర్‌ రావడంతోనే ఇలా జరిగిందన్నారు. అయినా ఓ చిన్నారిపై ఉగ్రవాది అని ముద్రవేయడం ఏమిటని, ఇది ముమ్మాటికే జాతి వివక్షేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని పియర్లాండ్‌ పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement