మొదటిసారి డేటింగ్‌కు వెళుతున్నాడు అందుకే.. | Viral Video Dog Get Excited For First Date | Sakshi
Sakshi News home page

ఈ జంట మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్

Published Thu, May 14 2020 8:44 AM | Last Updated on Thu, May 14 2020 9:24 AM

Viral Video Dog Get Excited For First Date - Sakshi

వీడియో దృశ్యాలు

మనుషులకే కాదు జంతువులకు కూడా కొన్ని విషయాల్లో ఒకే రకమైన భావోద్వేగాలు ఉంటాయని నిరూపిస్తోంది కెవిన్ అనే మగకుక్క‌. అందుకే మొదటిసారి డేటింగ్‌కు‌ వెళుతున్నపుడు చాలా నెర్వస్‌గా ఫీలైంది. తను డేటింగ్‌ చేయబోతున్న మోల్సొనాన్‌ డాంపుల్(ఆడకుక్క)‌కు అందంగా కనిపించడానికి తెగ కష్టపడింది. వాడ్‌రోబ్‌ మొత్తం జల్లెడ పట్టి, చివరకు బో టైతో సరిపెట్టుకుని డాంపుల్‌ను డేటింగ్‌కు తీసుకెళ్లటానికి బయలుదేరింది. డాంపుల్‌ ఇంటి దగ్గరకు చేరుకోగానే ఎక్సైట్‌మెంట్‌కు గురైందది. ఆ తర్వాత ఆమెను డిన్నర్‌కు తీసుకెళ్లటం. తన ప్లేటును మొత్తం ఖాళీ చేయటం.. సరదాగా ఇద్దరూ కబుర్లు చెప్పుకోవటం. చివరగా గుడ్‌బై చెబుతూ డాంపుల్‌.. కెవిన్‌ను హగ్‌ చేసుకోవటంతో డేటింగ్‌ ముగిసింది. ( ఈ పామును చూసైనా నేర్చుకోండి )

ప్రస్తుతం ఈ డాగ్‌ డేటింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 1.7 లక్షల వీక్షణలను సొంతం చేసుకుంది. అంతేకాకుండా వేల సంఖ్యలో కెవిన్‌, డాంపుల్‌ల డేటింగ్‌పై కామెంట్లు వచ్చాయి. ‘‘ ఈ జంట మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌.. నాకు కెవిన్‌ హ్యాట్‌ కావాలి. నేను డేటింగ్‌ వెళ్లేటప్పుడు అది ధరిస్తాను.. మొదటిసారి డేటింగ్‌కు వెళుతున్నాడు అందుకే ఆ ఎక్సైట్‌మెంట్ ’’ అంటూ నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.

చదవండి : పాపం! ఏదో అనుకుంది: ఇంకేదో అయ్యింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement