మిచిగాన్: టిక్‌టాక్ పిచ్చి ముదిరి పాకాన పడింది. ఓ రెస్టారెంట్ ఉద్యోగి కోతి చేష్టలతో ఉన్న జాబ్ కూడా పోగొట్టుకున్నాడు. ఈ ఘటన అమెరికాలోని జరిగింది. మిచిగాన్‌లోని వెండీస్ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగి స్నానం చేయడానికి వేరే మార్గమే లేదన్నట్లు సరాసరి కిచెన్‌లో దూరి అక్కడి సింక్‌లో సబ్బు నురగ, నీళ్లు నింపి బాత్‌టబ్‌లా మార్చేశాడు. వెంటనే అందులోకి దిగి స్నానం చేశాడు. ‘ఇది హాట్ టబ్‌లా అనిపిస్తుంది. దీన్ని నేను ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను’ అంటూ పేర్కొనడంతో అక్కడి వాళ్లంతా ఘొల్లున నవ్వారు. మరో ఉద్యోగి ‘నిన్ను నువ్వు తోముకో’ అంటూ ఓ వస్తువును సింక్‌లోకి విసరడంతో అతను నిజంగానే ఒళ్లు రుద్దుకోవడం ప్రారంభించాడు. (వేయించిన గబ్బిలాన్ని ఆర్డర్ చేసి..)
ఇక దీన్నంతటినీ వీడియో తీసి టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేయగా అది విపరీతంగా వైరల్ అయింది. మిగతా సామాజిక మాధ్యమాల్లోనూ ఈ వీడియో ప్రత్యక్షం కాగా, నెటిజన్లు ఉద్యోగి తీరుపై తీవ్రంగా స్పందించారు. ‘ఇది ఎంతో అసహ్యకరం. అందరికీ చెప్పేదేంటంటే, దయచేసి ఎవరూ ఇకపై ఆ రెస్టారెంట్‌కు వెళ్లకండి’ అని ఓ నెటిజన్ సూచించాడు. ‘సింక్ దగ్గరలోనే వంటకు ఉపయోగించే సామాగ్రి ఉంది. ఇది నిజం కాకపోతే బాగుండు’ ‘నీకేమైనా పిచ్చా.. కస్టమర్లకు ఇదేనా నువ్విచ్చే గౌరవం’ అంటూ ఘాటుగా కామెంట్లు చేశారు. ఇక ఈ వీడియోను టిక్‌టాక్ నుంచి తొలగించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అతని చేష్టలకు ఆగ్రహించిన యాజమాన్యం విధుల నుంచి తొలగించింది. (రెస్టారెంట్‌లో గొడవ.. దుస్తులిప్పి చితకబాదారు)
Comments
Please login to add a commentAdd a comment