పామును చంకలో పెట్టుకొని రైలెక్కాడు | Woman Spots Man Carrying A Snake On Crowded Train | Sakshi
Sakshi News home page

పామును చంకలో పెట్టుకొని రైలెక్కాడు

Published Tue, Aug 8 2017 3:33 PM | Last Updated on Sun, Sep 17 2017 5:19 PM

పామును చంకలో పెట్టుకొని రైలెక్కాడు

పామును చంకలో పెట్టుకొని రైలెక్కాడు

ఇప్పటి వరకు ఇంటర్నెట్‌లో ఎన్నో భయాందోళనకు గురయ్యే వీడియోలను మనం చూశాం. ముఖ్యంగా పాములకు సంబంధించినవయితే ఆశ్చర్యపోయే వీడియోలు లెక్కలేనన్ని.

బోస్టన్‌: ఇప్పటి వరకు ఇంటర్నెట్‌లో ఎన్నో భయాందోళనకు గురయ్యే వీడియోలను మనం చూశాం. ముఖ్యంగా పాములకు సంబంధించినవయితే ఆశ్చర్యపోయే వీడియోలు లెక్కలేనన్ని. అయితే, వాటన్నింటిని తలదన్నేలా ఇప్పుడు ఓ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ఎందుకంటే ఈసారి ఆ వీడియోలో పాము కనపించింది ఏ విమానంలోనో, లేక కారు ఇంజిన్‌లోనో, ఎయిర్‌ కండిషనర్‌లోనో కాదు.. ఓ వ్యక్తి ఒడిలో. అవునూ.. ఇది నిజమే.. ఓ వ్యక్తి తన ఒడిలో ఏం చక్కా పామును పెట్టుకొని ట్రైన్‌లో కూర్చొగా అది కాస్త సగం బయటకు వచ్చి అటూఇటూ చూడటం మొదలుపెట్టింది.

ఆ దృశ్యాన్ని చూసిన ఓ మహిళ భయంతో ఎగిరిగంతేసినంత పనిచేసింది. ఈ సంఘటన మాస్సాచుస్సెట్స్‌లోని బోస్టన్‌లో చోటు చేసుకుంది. ఆ వ్యక్తి కుక్క పిల్లుల మాదిరిగా పామును చంకలో పెట్టుకొని రైలు ఎక్కడం చూసి అప్పటి వరకు అతడి చుట్టు ఉన్నవాళ్లంతా కూడా భయంతో బెంబేలెత్తిపోయారు. అసలు రైలులో ఏం జరుగుతోంది? పాములతో ప్రయాణం ఏమిటీ.. అందుకు అసలు అనుమతి ఉందా? ఒక వేళ ఉన్నా ఆ పామును ప్రత్యేకంగా ఓ బాక్స్‌లో పెట్టి జాగ్రత్తగా తీసుకురావాలే తప్ప అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అంటూ వారంతామండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement