గన్ తో హల్ చల్ చేసిన మహిళ అరెస్టు! | Woman with gun arrested near White House | Sakshi
Sakshi News home page

గన్ తో హల్ చల్ చేసిన మహిళ అరెస్టు!

Published Fri, Nov 21 2014 11:37 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

గన్ తో హల్ చల్ చేసిన మహిళ అరెస్టు! - Sakshi

గన్ తో హల్ చల్ చేసిన మహిళ అరెస్టు!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ముందు గన్ తో హల్ చల్ చేసిన మహిళను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం వైట్ హౌస్ ముందు ఇద్దరు వ్యక్తులు గన్ తో తిరగడం వైట్ హౌస్ అధికారుల్లో అలజడి రేపింది. ఈ ఘటనకు సంబంధించి ఓ మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమెను మిచిగాన్ కు చెందిన లెహ్ నార్ట్ గా గుర్తించారు. ఆమె వద్ద 9ఎంఎం గన్ ఉన్నట్లు అమెరికన్ సీక్రెట్ సర్వీస్ స్పష్టం చేసింది.

 

అయితే ఆమె వెంట ఉన్న మరో వ్యక్తిని ఇంకా అరెస్ట్ చేయలేదని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ బబామా వైట్ హౌస్ లో ఉన్న సమయంలోనే ఆమెను అరెస్ట్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement