‘స్మార్ట్‌’ అస్త్రం.. | Smart Phone Services For Women | Sakshi
Sakshi News home page

‘స్మార్ట్‌’ అస్త్రం..

Mar 7 2019 3:51 PM | Updated on Mar 7 2019 4:02 PM

Smart Phone Services For Women - Sakshi

మొబైల్‌ను మొదట్లో ఇతరులతో మాట్లాడడానికి మాత్రమే ఎక్కువగా ఉపయోగించేవారు. కాలానుగుణంగా మారిన శాస్త్ర, సాంకేతికతతో మొబైల్‌ రంగంలో  ఎన్నో మార్పులొచ్చాయి. సాంకేతికత మరింతగా విస్తరించింది. ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల వారు మొబైల్స్‌ను అధికంగా వినియోగిస్తున్నారు.

తమ ఆలోచనలను ఇతరులతో పంచుకోవడానికి అవకాశం ఏర్పడింది. మహిళలకు ప్రత్యేకించి అనేక యాప్‌లు అందుబాటులోకి రావడం, వీటికి విస్తృత ఆదరణ లభించడంతో ప్రపంచవ్యాప్తంగా అధునాతన యాప్‌ల రూపకల్పనలో చాలా సంస్థలు నిమగ్నమయ్యాయి.

బ్యూటీ టిప్స్‌..

అతివల సౌందర్యానికి బ్యూటీటిప్స్‌ అనే యాప్‌ అందుబాటులో ఉంది. ప్రస్తుత జీవనవిధానం కారణంగా అందం పాడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ యాప్‌ద్వారా చక్కటి సూచనలు తెలుసుకునే అవకాశం ఉంది. పాదాలు, చర్మం, పెదవులు, కేశాలను రక్షించుకునే మెళకువల గురించిన పూర్తి సమాచారం ఇందులో అందుబాటులో ఉంటుంది.

 

ఆరోగ్య భద్రత..

మహిళల ఆరోగ్య భద్రతకు ఉమెన్‌ హెల్త్‌ డైరీ యాప్‌ అందుబాటులో ఉంది. ఈ డైరీలో పూర్తి వివరాలు నమోదు చేసుకుంటే ఆరోగ్యపరంగా ఎదురయ్యే సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారం తెలుసుకునే వీలుంది. రుతుసంబంధ, మానసిక రుగ్మతలను ఈ యాప్‌లో ఉన్న వివరాల ఆధారంగా అధిగమించే అవకాశం ఉంది.

కేశ సంరక్షణ..

స్త్రీల కేశసంరక్షణకు న్యూ హెయిర్‌ స్టైల్‌ అనే యాప్‌ అందుబాటులొకి వచ్చింది. దీని ద్వారా ప్రపంచంలో వచ్చే మార్పులకనుగుణంగా కేశాల రక్షణకు చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. 

ఇంటీరియర్‌ డిజైన్‌..

ఇంటి అలంకరణలో మహిళల పాత్ర కీలకం. వీరికోసం ఇంటీరియర్‌ డిజైన్‌ యాప్‌ అందుబాటులో ఉంది. నివసించే గది, భోజనశాల, వంటశాల, పడక గదులను అలంకరించడంలో ఈ యాప్‌ అధునాతన నమూనాలను అందిస్తున్నాయి. దేశ, విదేశాల్లో ఉన్న నిర్మాణ శైలిని ఈ యాప్‌ ద్వారా కళ్లముందు చూపిస్తుంది.

మేకప్‌..

వేడుకల్లో ప్రత్యేకంగా కనిపించడానికి మేకప్‌ యాప్‌ను అధికసంఖ్యలో వినియోగిస్తున్నారు నేటి యువత. ఈ యాప్‌లో అధునాతన అలంకరణకు పెద్దపీట వేస్తున్నారు. వివాహం చేసుకునే యువతులు ఈ యాప్‌తో నూతన విషయాలను తెలుసుకొని అలంకరణలో కొత్తపుంతలు తొక్కుతున్నారు.

రక్షణకు నిర్భయ.. 

మహిళల భద్రతకు నిర్భయ, రక్ష, ఉమెన్‌ సేఫ్టీ ఇలా 18రకాల యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. యాప్‌లో ఇచ్చిన సూచనల ఆధారంగా వివరాలు నమోదు చేసుకుంటే భద్రతకు డోకా లేదు. ఒంటరిగా వెళ్తున్న మహిళలపై ఏప్రాంతంలో దాడులు అధికంగా జరుగుతున్నాయో  ఈ యాప్‌ల ద్వారా పోలీసులకు సమాచారం అందుతుంది. 
 

100 నంబర్‌కు ఫోన్‌..

ఆపదలో ఉన్నప్పుడు మహిళలు 100 నంబర్‌కు ఫోన్‌ చేసినట్లయితే పోలీసులు వేగంగా స్పందించి రక్షణ చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉంటారు. సమాచారం అందిన వెంటనే సంబంధిత పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే అవకాశం ఉంది. షీ-టీమ్స్, రక్షక్‌ వాహనం, బ్లూకోర్ట్సు సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారు. అత్యవసర సమయాల్లో 100 డయల్‌కు ఫోన్‌ చేస్తే చాలు రక్షణ మీ ముందు ఉన్నట్లుగానే భావించే పరిస్థితులను పోలీసులు కల్పించారు.

నగర పోలీసుల వాట్సప్‌ సేవలు..

నగర పోలీసులు కమిషనరేట్‌ పరిధిలో అత్యవసర సేవల కోసం  ప్రత్యేక వాట్సాప్‌ నెంబర్‌ను క్రియేట్‌ చేశారు. 94910–89257 నంబర్‌ను సెల్‌లో ఫీడ్‌ చేసుకుంటే చాలు వాట్సప్‌ ఆన్‌ అవుతుంది. మహిళలు ఏదైనా ప్రమాదంలో ఉన్నట్లుగా గుర్తించి ఈ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేస్తే చాలు ఆ నంబర్‌ను ప్రత్యేక యాప్‌తో ఏ లోకేషన్‌లో ఉందో గుర్తించి సదరు వ్యక్తిని పోలీసులు కాపాడే అవకాశం ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement