సాక్షి,అచ్చంపేట రూరల్: ఓటర్ల నమోదుకు మరో అవకాశం కల్పిస్తున్నామని, జాబితాలో పేర్లు లేనివారు ఈనెల 9వరకు దరఖాస్తుచేసుకోవాలని ఆర్డీఓ పాండునాయక్ కోరారు. ఆదివారం పలు పోలింగ్ కేంద్రాల వద్ద చెక్ ఫర్ ఓటర్ ఐడీ అనే కార్యక్రమంనిర్వహించారు. ఓటర్లు ఓటరు లిస్టులో తమ పేర్లను చూసుకునేలా ఏర్పాట్లు చేశారు. అభ్యంతరాలు ఉంటే అక్కడే ఉన్న బీఎల్‌ఓలకులిఖిత పూర్వకంగా రాసి ఇస్తుండగా పరిష్కరిస్తున్నారు. 18 ఏళ్లు నిండిన వారి పేరు ఓటరు జాబితాలో లేకుంటే వెంటనే దరఖాస్తుచేసుకోవాలని కోరారు. కేంద్రాల్లోని నిర్వాహకులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు. ఆర్‌డీఓ వెంట తహసీల్దార్ అంజిరెడ్డి, బీఎల్‌ఓలు ఉన్నారు.
ఓటరుగా నమోదు చేసుకోండి:
ఉప్పునుంతల: మండలంలో ఆదివారం నిర్వహించిన ‘చెక్ యువర్ ఓట్’ కార్యక్రమాన్ని ఆర్డీఓ ఆర్ పాండునాయక్ పరిశీలించారు.మండలంలోని తాడూరు, ఉప్పునుంతలలో పర్యటించిన ఆయన బీఎల్‌ఓలు ఓటరు జాబితాలను ఎంతవరకు అందుబాటులో ఉంచారు,ఓటరు నమోదుకు సంబంధించిన కరపత్రాలను గ్రామాల్లో ఎంతవరకు ఓటర్లకు చేరవేశారనే అంశాలను తెలుసుకున్నారు. కొత్తగాఓటరు నమోదుకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయని బీఎల్‌ఓలను అడిగారు. ఓటరు జాబితాల్లో తమ ఓటును చూసుకున్నారా.. అనిఅక్కడ ఉన్న ఓటర్లను అడిగి తెలుసుకున్నారు. ఈనెల 9వ తేదీ వరకు కొత్తగా ఓటరు నమోదుకు అవకాశం ఉందని, అర్హులైనయువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్‌డీఓ కోరారు.
చెక్ యువర్ ఓట్ విజయవంతం: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆదివారం మండలంలో నిర్వహించిన ‘చెక్ యువర్ ఓట్’విజయవంతమైంది.మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఓలు ఓటరు జాబితాలతో అందుబాటులో ఉన్నారు. జాబితాలో పేర్లులేనివారు మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. పలు పోలింగ్ కేంద్రాలను తహసీల్దార్ సయ్యద్ ముజఫర్ ఉస్సేన్, డిప్యూటీ తహసీల్దార్ శరబందు పరిశీలించారు.