voter applications
-
ఉత్తరాంధ్రలో ‘పట్టభద్రులు’ పెరిగారు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల కమిషన్.. అభ్యంతరాల స్వీకరణకు డిసెంబర్ 9 వరకు గడువు విధించింది. ఈనెల 23న విడుదల చేసిన ముసాయిదా ప్రకారం.. ఈ ఏడాది మొత్తం 2,43,903 మంది గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. గతంలో ఎన్నికలు జరిగిన 2017తో పోలిస్తే ఉత్తరాంధ్ర జిల్లాల్లో అదనంగా 87,946 మంది గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా నమోదయ్యారు. అభ్యంతరాల స్వీకరణ సమయంలోనూ ఓటర్ల నమోదు కార్యక్రమానికి అనుమతులివ్వడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరో 50 వేల ఓటర్లు నమోదయ్యే అవకాశం 2017 సమయంలోనూ ఓటర్ల ముసాయిదాను 2016 నవంబర్ 1న ప్రకటించారు. ఆ సమయంలో మూడు ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో మొత్తం 1,26,452 మంది ఓటర్లుగా నమోదయ్యారు. అనంతరం అభ్యంతరాలు స్వీకరించే సమయంలో దరఖాస్తులు తీసుకోవడంతో అదనంగా 29,505 మంది కొత్త ఓటర్లు చేరారు. తుది జాబితా విడుదల చేసే సమయానికి ఈ ఓటర్లు సంఖ్య 1,55,957కి చేరుకుంది. ఈసారి కూడా అభ్యంతరాల స్వీకరణ సమయంలో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ముసాయిదాలో 2,43, 903 మంది ఓటర్లుండగా.. తుది జాబితా సమయానికి 2.90 లక్షలకు చేరుకుంటుందని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నమోదైన ఓటర్ల ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో మొత్తం 297 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. జిల్లా (ఉమ్మడి) 2017 తుది జాబితా ఓటర్లు 2022 ముసాయిదా ఓటర్లు శ్రీకాకుళం 31,313 46,119 విజయనగరం 34,570 71,518 విశాఖపట్నం 90,074 1,26,266 మొత్తం 1,55,957 2,43,903 అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటర్ల నమోదుకు సంబంధించిన ముసాయిదాపై ఏవైనా అభ్యంతరాలుంటే డిసెంబర్ 9లోగా ఫారం–18 ద్వారా తెలపాలి. సంబంధిత ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, డిసిగ్నేటెడ్ అధికారుల ద్వారా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు అందించవచ్చు. కేవలం అభ్యంతరాలు మాత్రమే కాకుండా.. ఇంకా ఎవరైనా పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోలేకపోతే వారికి మరో అవకాశం కలి్పస్తున్నాం. 2017లో నమోదైన అన్ని ఓట్లు రద్దు చేశాం. ఇంకా దీనిపై కొందరికి అవగాహన కలగలేదన్నది మా దృష్టికి వచ్చింది. అందుకే దీనిపై మరింత అవగాహన కలి్పంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – డా.మల్లికార్జున, కలెక్టర్ -
ఓటరుగా నమోదుకు ఇక 4 రోజులే
సాక్షి, అమరావతి : సార్వత్రిక ఎన్నికల ముంగిట... రాష్ట్రంలో ఓటరుగా నమోదుకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఇందుకు ఇక నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ స్వల్ప వ్యవధిలో నమోదు చేసుకోకపోతే వచ్చే నెల 11వ తేదీన జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయలేరు. కొత్తగా అర్హత సాధించినవారైనా లేదా ఓటర్ జాబితాలో పేరు లేనివారైనా ఈ నెల 15వ తేదీలోగా ఆన్లైన్(www.nvsp.in) ద్వారా గాని, సంబంధిత రెవెన్యూ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ఫాం 6ను సమర్పించడం ద్వారాగాని ఓటర్‌గా నమోదుకు దరఖాస్తు చేయాలి. ఈ విధంగా సమర్పించినవారికే 11వ తేదీన ఓటు వేసే హక్కు కల్పిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ‘18 సంవత్సరాలు నిండి ఇంకా ఓటర్‌గా నమోదు కాని యువత రాష్ట్రంలో 11 లక్షల మంది ఉన్నారు. వారంతా ఈ నెల 15వ తేదీలోగా ఫామ్– 6 సమర్పించాలి. ఓటర్ గుర్తింపు కార్డు ఉంది కదా అని ఓటున్నట్లు భావించవద్దు. జాబితాలో పేరుందో లేదో ఒకసారి తనిఖీ చేసుకోవాలి. ఓటరు కార్డున్నప్పటికీ జాబితాలో పేరు లేకుంటే పోలింగ్ రోజు ఓటు వేయలేరు. ఆన్లైన్లో కూడా తనిఖీ చేసుకోవాలి. పేరు లేకపోతే ఈ నెల 15వ తేదీలోగా ఫాం6 సమర్పిస్తే తప్పకుండా ఓటు హక్కు కల్పిస్తాం. సాధారణంగా నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటర్‌గా నమోదుకు అవకాశం ఉంటుంది. అయితే, ఇలా వచ్చిన దరఖాస్తులను తనిఖీ చేయడానికి నిబంధనల మేరకు పది రోజులు సమయం అవసరం. ఏడు రోజుల పాటు నోటీసులు జారీ చేయాలని, ఆ తరువాత తనిఖీకి, ఆమోదానికి మూడు రోజల సమయం పడుతుందని’ ద్వివేది వివరించారు. ఈ నేపథ్యంలోనే 15ను ఓటర్‌గా నమోదుకు చివరి తేదీగా పేర్కొన్నట్లు ప్రకటించారు. అప్పటివరకు వచ్చిన దరఖాస్తులు సక్రమంగా ఉంటే వారికి ఈ నెల 25వ తేదీలోగా ఓటు హక్కు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. -
ఓటు నమోదుకు ఇక నాలుగు రోజులే...
సాక్షి, ఏలూరు : ఓటు దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా నాలుగురోజులు మాత్రమే గడువు ఉంది. పరిశీలనకు పది రోజుల వరకూ సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ నెల 15 వరకూ మాత్రమే ఓటు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇప్పుడు ఓటర్ కార్డు ఉంటే సరిపోదు. ఓటు ఉందో లేదో చూసుకోవాల్సిన అవసరం ఏర్పడిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ సర్వేలు చేసి తమకు అనుకూలంగా లేనివారి ఓట్లు తొలగించేందుకు ప్రయత్నాలు చేసిన నేపథ్యంలో అందరూ తమ ఓటు ఉందో లేదో చూసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఒకవేళ ఓటు లేకపోతే వెంటనే నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ఓటు ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు ఓటర్ ఐడీ కార్డు మీద ఎపిక్ నంబర్‌ను 1950కు ఎస్ఎంఎస్ చేస్తే ఓటు ఉందో లేదో తెలుస్తుంది. ఓటు లేని వాళ్లు ఆన్లైన్లో ఫామ్–6 నింపి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం తహసీల్దార్ ఆఫీసులో గానీ, బూత్‌లెవల్ అధికారిని గానీ సంప్రదించాలి. అధికార పార్టీ దురాగతాలను ఎదుర్కొవాలంటే ప్రతి ఓటు కీలకమైన నేపథ్యంలో ఓటును అందరూ ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫారం–7 ద్వారా జిల్లాలో 38,145 బోగస్ దరఖాస్తులు దాఖలు కాగా, వాటిని పరిశీలించి ఇప్పటికే 32 కేసులు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన కారణంగా ఇకపై ఓటరు జాబితా నుంచి ఒక్క ఓటును కూడా తొలగించే అవకాశం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో 9 వేల ఓట్లు రెండు ప్రాంతాల్లో నమోదైనట్టు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వాటిలో 1,700 ఓట్లను తొలగించామని తెలిపారు. మండల కేంద్రాల్లో ఆన్లైన్ ప్రక్రియ ఎన్నికల సమయానికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్లు ఓటు దరఖాస్తు కోసం ఆన్లైన్ ప్రక్రియను ప్రారంభించారు. దరఖాస్తులు స్వీకరించి ఆన్లైన్లో వాటిని నమోదు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి ఓటు హక్కు నమోదు చేసుకునేలా ఓటర్ హెల్ప్‌లైన్ పోర్టల్ యాప్‌ను ఎన్నికల సంఘం రూపొందించింది. ఈ పోర్టల్‌లో మన దరఖాస్తు ఏ స్టేజీలో ఉందో కూడా తెలుసుకోవచ్చు. అధికారులు దరఖాస్తులు పరిశీలించి ఆమోదిస్తే ఓటరు గుర్తింపు కార్డును సర్వీస్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధానంతో కార్యాలయాల చుట్టూ తిరిగి దరఖాస్తు ఇచ్చే అవసరం పూర్తిగా తీరనుంది. ఓటు నమోదుకు ప్రత్యేకంగా ఫారమ్–6ను నింపి ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో అందించాల్సి ఉంటుంది. ఫారమ్–6 ప్రతి ఈ సేవా కేంద్రాల్లో, తహసీల్దార్ కేంద్రాల్లో, జిల్లా కేంద్రమైన ఏలూరులోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎన్నికల విభాగంలోనూ లభిస్తుంది. ఆన్లైన్లో www.coeandhra.nic.in, www.nvsp.in అనే వెబ్సైట్ ద్వారా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. -
దరఖాస్తులను ఆన్లైన్ చేయాలి
సాక్షి, సూపర్‌బజార్(కొత్తగూడెం): పోలింగ్ కేంద్రాల వారీగా వచ్చిన ఓటరు నమోదు దరఖాస్తులను ఆన్లైన్ చేయాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ హాలులో ఓటరు నమోదు, తొలగింపు, మార్పులు, కళ్యాణలక్ష్మి, భూమి రికార్డుల శుద్ధీకరణ తదితర అంశాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో పేరు తొలగింపును తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించడంతోపాటు నోటీసులు జారీ చేసిన తరువాత మాత్రమే తొలగించాలని అన్నారు. ఓటరు జాబితాలో పేరు తొలగింపు కోసం ఆన్లైన్ ద్వారా ఫారం 7లో వచ్చిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ నెల 2, 3 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో పోలింగ్ కేంద్రాల వారీగా వచ్చిన దరఖాస్తులను అప్లోడ్ చేయాలని అన్నారు. జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా లబ్ధిదారులకు ఆర్థికసాయం అందజేయడానికి వచ్చిన దరఖాస్తులను తక్షణం విచారణ జరిపించాలన్నారు. సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గౌతం, జాయింట్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, భద్రాచలం సబ్ కలెక్టర్ భవేష్‌మిశ్రా, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. సస్యరక్షణ కరపత్రాన్నిఆవిష్కరించిన కలెక్టర్ కొత్తగూడెంరూరల్: ఆయిల్‌పామ్, కొబ్బరి, జామ, ఇతర ఉద్యాన పంటలను ఆశిస్తున్న సర్పిలాకార తెల్లదోమ ఉనికి, ప్రభావం–సస్యరక్షణ చర్యలపై రూపొందించిన కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఆవిష్కరించారు. గురువారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎంతో మేలు చేసేవిధంగా ఉద్యాన శాఖాధికారులు ఈ కరపత్రాన్ని రూపొందించారన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు, ఎస్పీ సునీల్‌దత్, ఉద్యానవన శాఖాధికారి జినుగు మరియన్న తదితరులు పాల్గొన్నారు. -
ఓటరు నమోదుకు భారీగా దరఖాస్తులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఓటు హక్కు కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. గత మూడు నెలల్లో 1.90 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఆన్లైన్ విధానంలో అందిన దరఖాస్తులే. అధికారులకు నేరుగా మరో 30వేలకు పైగా అంది ఉంటాయని అంచనా. ఈనెల 4వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలామంది యువత ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. అత్యధికంగా మహేశ్వరం, శేరిలింగంపల్లి నియోజకవర్గాల నుంచి 30వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులని అధికారులు విస్తృతంగా ప్రచారం చేయడం కలిసి వచ్చింది. అంతేగాక ఓటు నమోదు కోసం ఈనెల 2న స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బూత్లెవల్లో క్యాంపులు ఏర్పాటు చేసి అర్హులైన వారి నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. దీని ఫలితంగానే అధిక సంఖ్యలో దరఖాస్తులు అందినట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే 80 వేల మంది కొత్తగా ఓటు హక్కు కోసం అందిన దరఖాస్తులను (ఫారం–6) అధికారులు వడబోస్తున్నారు. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. స్థానికంగా ఉంటున్నారా లేదా అని ఆరాతీస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా ఉంటే ఓటు హక్కు కల్పిస్తున్నారు. 1.90 లక్షల దరఖాస్తుల్లో ఇప్పటివరకు 87 వేలకుపైగా ఆమోదించారు. వీటిలో 80 వేలకుపైగా ఓటర్ల వివరాలను జాబితాలో నమోదు చేశారు. 96 వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. దాదాపు ఏడు వేల దరఖాస్తులను తిరస్కరించారు. భారీగా తొలిగింపు ఓటు హక్కు తొలగింపునకు 15 వేలకుపైగా ఓటర్లు దరఖాస్తులు సమర్పించారు. పట్టణ ప్రాంత, నగర శివారు నియోజకవర్గాలైన ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో బతుకుదెరువు కోసం వచ్చి నివసిస్తున్నారు. వీరంతా తమ సొంత నియోజకవర్గాల్లో ఓటు హక్కు పొందేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడి ఓటును జాబితా నుంచి తొలగించుకున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో దరఖాస్తులు అధికంగా వచ్చాయని పేర్కొంటున్నారు. అంతేగాక కొందరు తమ నివాసాన్ని ఒక నియోజకవర్గం నుంచి మరొక అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోకి మార్చి ఉండొచ్చు. ఇటువంటి వారంతా ఓటు తొలగింపునకు ఫారం–7ను అందచేశారు. ఇప్పటివరకు 10వేల పైచిలుకు ఓట్లను తొలగించారు. అలాగే పేరు, ఇంటిపేరు, నివాస చిరునామా, పుట్టిన తేదీ తదితర చేర్పులు మార్పుల కోసం 25వేలకుపైగా దరఖాస్తులు అందాయి. పోలింగ్ స్టేషన్ మార్పు కోసం 4వేల పైచిలుకు మంది దరఖాస్తు చేసుకున్నారు. 22న ముసాయిదా జాబితా కొత్తగా ఓటు నమోదు, పోలింగ్ స్టేషన్ మార్పు, తొలగింపులు, చేర్పులు, మార్పుల కోసం అందిన దరఖాస్తులను యంత్రాంగం పరిశీలిస్తోంది. ఇప్పటికే సగానికిపైగా పరిశీలించారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఈనెల 22న ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు. మొన్నటి శాసనసభ ఎన్నికల నాటికి జిల్లాలో 28.08 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా మరింత కొందరికి ఈ జాబితాలో చోటుదక్కే అవకాశం. ఫలితంగా జిల్లా ఓటర్ల సంఖ్య 29 లక్షల మార్క్‌ను దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. -
నేడు ఒక్కరోజే..!
నల్లగొండ : ఓటరు నమోదుకు సోమవారం ఒక్కరోజే అవకాశం ఉంది. ఓటరు జాబితాలో పేరు లేనివారు ఇప్పుడు నమోదు చేసుకుంటేనే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుంది. లేదంటే ఓటుహక్కు కోల్పోవాల్సిందే. అర్హులంతా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి ఇప్పటికే పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా 1,628 పోలింగ్స్టేషన్లలో ప్రత్యేక క్యాంపులు పెట్టి ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. అర్హులందరికీ ఓటుహక్కు కల్పించడమే లక్ష్యం.. 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటహక్కు నమోదు చేసుకునే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టి ఓటుహక్కు నమోదు చేసుకునే విధంగా జిల్లాలో అనేక ప్రచార, చైతన్య కార్యక్రమాలను చేపట్టింది. దీంతో జిల్లా వ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున ఓటుహక్కు నమోదు చేసుకుంది. అంతేకాకుండా ఒకచోట నుంచి మరోచోటుకు ఓటును మార్పుకోవడంతోపాటు పేర్లలో దొర్లిన తప్పులను సరిదిద్దేందుకు కూడా అవకాశం ఇవ్వడంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కానీ ఎన్నికల సమయానికి అక్కడక్కడా ఓట్లు గల్లంతయ్యాయి. చాలా మంది ఓటర్లు ఓటు వేసే అవకాశం లేక నిరాశకు గురయ్యారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైన, 1 జనవరి 2019 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా.. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది. జనవరి 25వ తేదీ ఓటరు నమోదుకు చివరి తేదీగా నిర్ణయించి అవకాశం కల్పిం చింది. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అంతా బిజీగా ఉండడంతో ప్రజల నుంచి పెద్దగా స్పందన రాలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం ఓటరు నమోదు ఫిబ్రవరి 4 వరకు పొడిగించింది. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక క్యాంపులు సోమవారం ఓటు నమోదుకు చివరి గడువు కావడంతో ఆదివారం జిల్లా వ్యాప్తంగా 1,629 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటరు నమోదుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించారు. సెలవు దినం ప్రజలకు అనుకూలంగా ఉంటుందని ఆది వారం ఈ క్యాంపులు ఏర్పాటు చేశా రు. ప్రతీ పోలింగ్స్టేషన్లో బీఎల్ఓలను ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంచారు. వారి వద్ద కొత్తగా ఓటరు నమోదు చేసుకునేందుకు ఫారం–6తో పాటు మార్పులు, చేర్పుల కోసం కూడా దరఖాస్తులను సిద్ధంగా ఉంచారు. ప్రజల నుంచి మంచి స్పందన.. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. పోలింగ్ స్టేషన్లకు వచ్చి ఓటు లేనివారు ఓటుహక్కు నమోదు చేసుకోవడంతోపాటు కొందరు పేర్లలో దొర్లిన తప్పిదాలను సరి చేసుకునేందుకు దరఖాస్తులు చేసుకున్నారు. క్యాంపులను పరిశీలించిన జేసీ, ఆర్డీఓ.. పోలింగ్ స్టేషన్లలో నిర్వహించిన ప్రత్యేక క్యాంపులను జిల్లా జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి, నల్లగొండ ఆర్డీఓ జగదీశ్‌రెడ్డి పరిశీలించారు. నల్లగొండ పట్టణంలోని పశు వైద్యశాల వద్ద ఉన్న పోలింగ్ స్టేషన్‌తోపాటు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఉన్న పోలింగ్‌స్టేషన్‌ను రామగిరి, ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ స్టేషన్‌ను సందర్శించి ఓటు నమోదు, తదితర విషయాలపై బీఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు. నేడు ఆఖరి గడువు.. ఓటు నమోదుకు ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు సోమవారంతో ముగియనుంది. వచ్చే పార్లమెంట్, తదితర ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఖచ్చితంగా ఓటు లేని వారు ఓటుహక్కు నమోదు చేసుకోవాల్సిందే. ఓట్లు గల్లంతైనా.. 18 సంవత్సరాలు నిండి ఓటు లేనివారు దరఖాస్తు చేసుకుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. -
మేము సైతం..
అమెదక్ అర్బన్: మెదక్ జిల్లాలో ఓటరు నమోదుకు మంచి స్పందన లభిస్తోంది. ఓటరు జాబితాలో పేర్లు లేని వారు 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం ఫిబ్రవరి 4వ తేదీ వరకు గడువునిచ్చింది. దీంతో ఇప్పటి వరకు ఓటరు జాబితాలో పేర్లు నమోదు కాని వారు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఒకవైపు గ్రామపంచాయతీ ఎన్నికల హడావుడి ఉండగా ఓటరు నమోదు ప్రక్రియ సైతం ముమ్మరంగా సాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఓటరు నమోదు ప్రక్రియను చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వపరంగా సంబంధిత దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచడంతో పాటు ఆన్లైన్లో కూడా నమోదు చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకితీసుకువచ్చారు. ఇదిలా ఉండగా వివిధ రాజకీయ పార్టీలు సైతం ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేయించడానికి ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ క్రమంలో పార్టీల నాయకులు, బాధ్యులు ఓటరు నమోదుకు సంబంధించిన ఫారాలను, మార్గదర్శకాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేస్తూ అర్హులైన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయించడంపై దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల హడావుడి, అది పూర్తి కాగానే గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఓటరు జాబితాలో ఓటుహక్కుకోసం దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 4వ తేదీ చివరి తేదీగా నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 19,993 మంది నూతనంగా ఓటరు లిస్టులో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకున్న వారిలో 18సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఎక్కువగా ఉన్నారు. ఓటరు నమోదుపై జిల్లా యంత్రాంగం ఆయా కళాశాలల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించడం, ఓటు హక్కు విలువ తెలియజేయడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. దీంతో కళాశాలల్లోని యువతీయువకులు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మెదక్ జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉండగా మొత్తం 3,97,999 మంది ఓటర్లు ఉన్నారు. మెదక్ నియోజకవర్గంలో 1,95,649, నర్సాపూర్ నియోజకవర్గంలో 2,02,350 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన నూతన ఓటరు నమోదు ప్రక్రియతో 19,993 మంది ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా ఓటు హక్కుకు నూతనంగా నమోదు చేసుకున్నారు. వాటిలో మెదక్ నియోజకవర్గం నుంచి 10,757, నర్సాపూర్ నియోజకవర్గం నుంచి 9,236 మంది కొత్తగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం ఫిబ్రవరి 22న ఓటర్ల తుది జాబితా ప్రకటించడం జరుగుతుంది. -
ఇప్పుడైనా సరిచేస్తారా?
బోథ్: రాష్ట్రంలో జనవరి రెండో వారంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు సన్నద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పంచాయతీ ఎన్నికల్లో పౌరులు పోటీ పడతారు. పట్టణాల్లో ఉన్నవారు సైతం వ్యయప్రయాసాలకోర్చి తమ సొంత గ్రామాలకు చేరుకుని ఓటు వేస్తారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తే ఓటరు జాబితాలో పేర్లు గల్లంతు కావడంతో కంగు తిన్నారు. స్థానికంగా ఉండే వారి పేర్లు సైతం తొలగించారు. పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటేసేందుకు వచ్చిన పలువురు ఓటరు జాబితాల్లో పేర్లు లేక ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలతోపాటు పార్లమెంట్ ఎన్నికలను దష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించే దిశగా ప్రయత్నిస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల గల్లంతు ముప్పు తప్పుతుంది. ముసాయిదా ఓటరు జాబితా సవరణలో కీలకంగా వ్యవహరించాల్సిన బీఎల్వోలు విధులు సక్రమంగా నిర్వహించకనే ఈ పరిస్థితి తలెత్తుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చేయాల్సింది ఇలా.. పోలింగ్ కేంద్రం పరిధిలోని గ్రామాల్లో ఓటరు నమోదుతోపాటు తొలగింపులో బీఎల్ఓలు ప్రముఖ పాత్ర పోషించాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ముసాయి దా ఓటరు జాబితా సవరణ సమయంలో బూత్ లెవల్ అధికారి ఇంటింటికీ తిరిగి ఓటరు నమోదుపై చైతన్యం కల్పించాలి. జాబితా నుంచి ఎవరి పేరునైనా తొలగించాలంటే నోటీసు ఇచ్చి విచారణ జరపాలి. నిర్ధారణ చేసుకున్న తర్వాతనే పేరు తొలగించాల్సి ఉంటుంది. సాధారణంగా పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటరు నమోదు కోసం ప్రత్యేకంగా డ్రైవ్ చేపడతారు. ఆ సమయంలో బీఎల్ఓలు స్థానికం గా అందుబాటులో ఉండి అర్హులైన వారి పేర్లు జాబితాలో నమోదు చేసుకోవాలి. ఓటు హక్కు కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించాలి. చేస్తున్నారిలా.. బీఎల్ఓలు స్థానికంగా ఉండకపోవడంతో స్థానిక రాజకీయ నాయకుల మాటలు విని వారు చెప్పినట్లు నడుచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతోనే ఓట్ల తొలగింపు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఓటరు జాబితాలో ఒక్కసారి పేరు నమోదైతే తొలగించాలంటే తప్పనిసరిగా ఆ ఓటరు సమీప ఇంటి యజమానుల నుంచి వివరణ తీసుకోవాలి. తర్వాత తొలగాంచాలని నిబంధనలు చెబుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయంతోపాటు ఇంటర్నెట్ ద్వారా వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే బీఎల్ఓలు తిరస్కరిస్తున్నారు. దీంతో అన్ని అర్హతలుండి ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నా జాబితాలో పేర్లు నమోదు కాకపోవడం గమనార్హం. పర్యవేక్షణ అవసరం.. బీఎల్ఓల పనితీరు పర్యవేక్షించడంతోపాటు పారదర్శకంగా ఓటరు జాబితాలను రూపొందించేందుకు తహసీల్దార్ నుంచి జిల్లా అధికారుల వరకు పర్యవేక్షణ అవసరం. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటరు నమోదు కోసం పలు స్వచ్ఛంద సంస్థలు యువతతోపాటు అర్హులైన వారందకూ తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ప్రత్యేకంగా సదస్సులు నిర్వహించారు. ఈ సందర్బంగా ఫారం–6 పంపిణీ చేసి దరఖాస్తు చేయించారు. రెవెన్యూ అధికారులు ఆ దరఖాస్తులను ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. కానీ చాలా మంది పేర్లు జాబితాలో నమోదు కాలేదు. దీంతో ఓటు హక్కును కోల్పోయారు. ట్యాబ్‌లల్లో చిరునామాలు కూడా అప్లోడ్ చేయకపోవడంతో బీఎల్వోలకు చిరునామాలు దొరకక వాటిని తిరస్కరించారు. వీటన్నింటినీ పర్యవేక్షించి లోటు పాట్లను సరిచేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓటరు జాబితా అస్తవ్యస్తంగా తయారైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్తగా ఓటరు నమోదుకు అవకాశం కొత్త ఓటర్లు, ఓట్లు గల్లంతైన వారికోసం ఎన్నికల సంఘం మరో అవకాశాన్ని ఇచ్చింది. ఈ నెల 26 నుంచి వచ్చే ఏడాది జనవరి 25 వరకు ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగనుంది. అయితే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీ అభ్యర్థులు నామినేషన్ వేసే రెండు రోజుల ముందు వరకు కొత్త ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గల్లంతైన వారు, కొత్త ఓటరు నమోదు చేయదలచిన వారు, మార్పులు, చేర్పుల కోసం బీఎల్ఓలను సంప్రదించాలని అధికారులు పేర్కొంటున్నారు. నా ఓటు తీసేశారు.. ఇప్పటి వరకు చాలా ఎన్నికల్లో ఓటు వేశాను. కానీ ఇలాంటి సంఘటన చోటు చేసుకోలేదు. నా ఓటు తీసేశారు. ఎలా తీసేశారని అధికారులను అడిగితే సమాధానం ఇవ్వడం లేదు. దీన్ని చాలా అవమానకరంగా భావిస్తున్నా. అధికారుల తప్పిదం వల్ల చాలా మంది తమ ఓటును వేయలేకపోయారు. – రామాయి నారాయణ, సొనాల -
నేటి నుంచి ఓటరు నమోదు
షాద్‌నగర్‌టౌన్: ఓటు హక్కు నమోదుకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. బుధవారం నుంచి ఓటరు సవరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటు వేసేందుకు చాలా మంది ఉత్సాహం కనబర్చారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు సుదూర ప్రాం తాల నుంచి స్వగ్రామాలకు వచ్చారు. తీరా పోలింగ్ కేంద్రానికి వెళ్తే ఓటరు జాబితాలో పేరు లేదని తెలుసుకుని ఆవేదనచెందారు. కొందరు ఆగ్రహంతో అధికారులను నిలదీశారు. జాబితాలో తమ పేరు ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. దీనికి అధికారులు సరైన సమాధానం చెప్పలేకపోయారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు వేల సంఖ్యలో ఓటరు జాబితా నుంచి పేర్లు మాయమయ్యాయి. చాలా మండలాల్లో ఓట్లు గల్లంతు కావడంతో ఎన్నికల సంఘం అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. సవరణ ప్రక్రియ ప్రారంభం అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం మరో మారు ఓటు హక్కు నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. బుధవారం నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. ఓటు హక్కు నమోదు కోసం ప్రజలు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో నమోదు చేసుకుంటే సరిపోతుంది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్వీఎస్పీ.ఐఎన్ లింక్ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి విచారణ చేపట్టి ఓటు హక్కు కల్పిస్తారు. 2019 జనవరి 1 తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు, గతంలో ఓటు హక్కు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు ఎన్నికల సంఘం బుధవారం ముసాయిదా ఓటరు జాబితా ప్రకటిస్తుంది. జనవరి 25 తేదీ వరకు అభ్యంతరాలు, వినతులను అధికారులు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 11లోపు వాటిని పరిశీలించి ఫిబ్రవరి 22న తుది జాబితాను ప్రకటిస్తారు. ఓటు హక్కు కోల్పోయిన వారు ఆలస్యం చేయకుండా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఓటు హక్కు నమోదు పట్ల నిర్లక్ష్యం వహించకూడదు. -
సహకార సమరానికి సన్నద్ధం
వరంగల్ రూరల్: జిల్లాలోని 32 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఓటరు జాబితాలను సిద్ధం చేసి సొసైటీల్లో అందుబాటులో ఉంచారు. ఈ జాబితాలపై ఈ నెల 27వ తేదీ వరకు అభ్యంతరాలు ఉంటే తెలపవచ్చు. అభ్యంతరాల స్వీకరణ పూర్తయ్యాక చేర్పులు, మార్పులతో రూపొందిన తుది జాబితాకు ఈ నెల 28న ఎన్నికల రిజిస్ట్రార్ ఆమోదం తెలపనున్నారు. ఈ నెల 30న ఓటర్ల జాబితాకు రాష్ట్ర సహకార ఎన్నికల నిర్వాహకులు ఆమోదముద్ర వేయనున్నారు. ఇదిలా ఉండగా సంగెం పీఏసీఎస్ పాలకవర్గం పదవీ కాలం 2020, ఆగస్టు 2 వరకు ఉన్నందువల్ల ఆ సొసైటీకి మినహా మిగతా 32 పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోని 32 సొసైటీల్లో మొత్తం 1,58,011 మంది ఓటర్లు ఉన్నారని ఆమె వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధం ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘాల తుది జాబితా డిసెంబర్ 30 ఆమోదం పొందాక ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషనే మిగిలి ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. – ఎస్.పద్మ, జిల్లా సహకార శాఖ అధికారి -
మరో చాన్స్!
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : ప్రజాస్వామ్యంలో ఓటుకు విలువ కట్టలేము. ఓటు అనే బ్రహ్మస్త్రంతో భవిష్యత్‌ను తీర్చిదిద్దుకునే అవకాశముంది. ఓటరు జాబితాలో పేర్లు చూసుకుని అర్హులైన వారందరూ ఓటు హక్కు పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నా పలువురు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. ఈ మేరకు పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత కొత్త ఓటర్ల నమోదుతో పాటు మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. గత శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు కోల్పోయిన వారితో పాటు కొత్తగా 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. నేటి నుంచి... కొత్త ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పుల కోసం బుధవారం నుంచి వచ్చే నెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్నికల సంఘం త్వరలోనే పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్దమవుతోంది. ఈ మేరకు 18 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతీ ఒక్కరు ఓటరుగా నమోదయ్యేలా చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన అవసరముంది. జిల్లాలో 10,26,728 మంది ఓటర్లు మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 10,26,728 మంది ఓటర్లు ఉన్నారు. ఈ సంఖ్య ప్రకారమే తాజా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ జాబితా విడుదల చేసింది. అయినప్పటికీ పలువురు తమ పేర్లు జాబితాలో లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రస్తుత అవకాశాన్ని అర్హులందరూ వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ కోరుతోంది. గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాన్ని పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అర్హులందరిపై ఉందని చెబుతున్నారు. 2019 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు ప్రతీ ఒక్కరు ఓటుహక్కు నమోదు చేసుకునేందుకు అర్హులు. గ్రామంలోని బూత్‌లెవల్ అధికారికి లేదా తహసీల్దార్ కార్యాలయంలో కానీ ఫారం–6 దరఖాస్తులు సమర్పించాలి. మీసేవా కేంద్రాల్లో లేదా స్వయంగా కానీ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. -
ఎమ్మెల్సీ పోరు..!
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగి సింది. రాష్ట్ర ఎన్నికల సంఘం పంచా యతీ, ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికలు ఒకదాని తరువాత ఒకటి నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తూ ఎప్పటికప్పుడు సమాయత్తమవుతోంది. మార్చి 31తో ముగియనున్న ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీల ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదును ఎన్నికల సంఘం మొదటి విడతగా ప్రారంభించింది. కరీంనగర్: మెదక్, నిజామాబాద్, ఆదిలా బాద్, కరీంనగర్ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీల ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు అప్పుడే ప్రచారం మొదలుపెట్టారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ నియోజకవర్గంలో ఒక గ్రాడ్యుయేట్, ఒక ఉపాధ్యాయల ఎమ్మెల్సీల కోసం ఎన్నికలను నిర్వహించడానికి సీఈవో షెడ్యూల్ జారీ చేయడంతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయ ఓటర్లతో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నారు. ఇం దులోభాగంగానే వాట్సప్, ఫేస్బుక్ వంటి సోషల్‌మీడియాలో కూడా తమ ప్రచారం కొనసాగిస్తున్నారు. ఓటర్ల మొబైల్ నెంబర్లను సేకరించి ఎస్ఎంఎస్లను పంపేందుకు సిద్ధమవుతున్నారు. అభ్యర్థులను ప్రకటిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలుగా పోటీ చేయడానికి కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన పలువురు అభ్యర్థులు ఓటు నమోదు కేంద్రాలను సైతం ఏర్పాటు చేసి ఓటర్లలో అవగాహన కల్పించి ఇప్పటికే ఓటు నమోదు చేయించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో...? పీఆర్టీయూటీఎస్ ముందు వరుసలో ఉన్నది. తమ సంఘం తరఫున కరీంనగర్ నుంచి రఘోత్తంరెడ్డిని బరిలో నిలిపింది. టీటీఎఫ్ నుంచి రాములును బరిలో నిలిపిన సంగతి తెలిసిందే. ఎస్టీయూ కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మామిడి సుధాకర్‌రెడ్డిని ఇటీవలే ప్రకటించింది. ఈ నెలాఖరులోగా మిగిలిన ఉపాధ్యాయ సంఘాలు కూడా తమ అభ్యర్థులను ప్రకటించడానికి కసరత్తు చేస్తున్నాయి. కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్సీ భట్టారపు మోహన్‌రెడ్డి కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుని ఇది వరకే ఓ దఫా ప్రచారాన్ని పూర్తి చేశారు. పట్టభద్రుల బరిలో..? కేజీ టూ పీజీ విద్యాసంస్థల జేఏసీ అభ్యర్థిగా మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి, ప్రైవేట్ పాఠశాలల తరఫున ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి శేఖర్‌రావు, గ్రూప్–1 ఉద్యోగుల సంఘం తరఫున మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, కిమ్స్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పేర్యాల దేవేందర్‌రావు గ్రాడ్యుయేట్ ఎన్నికల బరిలో దూసుకుపోతున్నారు. ఓటు నమోదుకు ముందుకురాని ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు ముందుకు వస్తున్నప్పటికీ దాదాపు 40 శాతం ఉపాధ్యాయులు ఓటరుగా పేరు నమోదు చేయించుకోలేదని సమాచారం. కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో దాదాపు 27 వేలవరకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఉంటే.. ఇప్పటివరకు 14 వేల మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు సమాచారం. గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలోను ఇప్పటివరకు సుమారు 62వేల మంది వరకు మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పటివరకు సగం శాతం కూడా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోకపోవడం విశేషం. తక్కువ సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేసుకున్న నేపథ్యంలో మిగిలిన వారు కూడా ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి జనవరి 31 వరకు ఎన్నికల సంఘం గడువును పొడగించింది. -
ఓటరు నమోదుకు మరో అవకాశం
సాక్షి,అచ్చంపేట రూరల్: ఓటర్ల నమోదుకు మరో అవకాశం కల్పిస్తున్నామని, జాబితాలో పేర్లు లేనివారు ఈనెల 9వరకు దరఖాస్తుచేసుకోవాలని ఆర్డీఓ పాండునాయక్ కోరారు. ఆదివారం పలు పోలింగ్ కేంద్రాల వద్ద చెక్ ఫర్ ఓటర్ ఐడీ అనే కార్యక్రమంనిర్వహించారు. ఓటర్లు ఓటరు లిస్టులో తమ పేర్లను చూసుకునేలా ఏర్పాట్లు చేశారు. అభ్యంతరాలు ఉంటే అక్కడే ఉన్న బీఎల్ఓలకులిఖిత పూర్వకంగా రాసి ఇస్తుండగా పరిష్కరిస్తున్నారు. 18 ఏళ్లు నిండిన వారి పేరు ఓటరు జాబితాలో లేకుంటే వెంటనే దరఖాస్తుచేసుకోవాలని కోరారు. కేంద్రాల్లోని నిర్వాహకులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు. ఆర్డీఓ వెంట తహసీల్దార్ అంజిరెడ్డి, బీఎల్ఓలు ఉన్నారు. ఓటరుగా నమోదు చేసుకోండి: ఉప్పునుంతల: మండలంలో ఆదివారం నిర్వహించిన ‘చెక్ యువర్ ఓట్’ కార్యక్రమాన్ని ఆర్డీఓ ఆర్ పాండునాయక్ పరిశీలించారు.మండలంలోని తాడూరు, ఉప్పునుంతలలో పర్యటించిన ఆయన బీఎల్ఓలు ఓటరు జాబితాలను ఎంతవరకు అందుబాటులో ఉంచారు,ఓటరు నమోదుకు సంబంధించిన కరపత్రాలను గ్రామాల్లో ఎంతవరకు ఓటర్లకు చేరవేశారనే అంశాలను తెలుసుకున్నారు. కొత్తగాఓటరు నమోదుకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయని బీఎల్ఓలను అడిగారు. ఓటరు జాబితాల్లో తమ ఓటును చూసుకున్నారా.. అనిఅక్కడ ఉన్న ఓటర్లను అడిగి తెలుసుకున్నారు. ఈనెల 9వ తేదీ వరకు కొత్తగా ఓటరు నమోదుకు అవకాశం ఉందని, అర్హులైనయువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ కోరారు. చెక్ యువర్ ఓట్ విజయవంతం: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆదివారం మండలంలో నిర్వహించిన ‘చెక్ యువర్ ఓట్’విజయవంతమైంది.మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో బీఎల్ఓలు ఓటరు జాబితాలతో అందుబాటులో ఉన్నారు. జాబితాలో పేర్లులేనివారు మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. పలు పోలింగ్ కేంద్రాలను తహసీల్దార్ సయ్యద్ ముజఫర్ ఉస్సేన్, డిప్యూటీ తహసీల్దార్ శరబందు పరిశీలించారు. -
ఆన్లైన్లో ఓటు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఓటుహక్కు పొందేందుకు మరో అవకాశం లభించింది. ఈసారి ఆన్లైన్లో దరఖాస్తు సమర్పిస్తే.. సరిపోతుంది. గతంలో ఓటరుగా దరఖాస్తు చేసుకున్నారా..? ఓటు రాలేదా...? పేరు, చిరునామాలో మార్పు సమస్య పరిష్కారం కాలేదా..? మీరంతా నిశ్చింతంగా ఉండి మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందు కోసం కేంద్ర ఎన్నికల సంఘం నవంబర్ (వచ్చే నెల) 12వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసేవరకు గడువునిచ్చింది. అర్హులు ఆన్లైన్లో ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు. వీటిని పరిశీలించి అర్హులకు త్వరితగతిన ఓటునందించే అవకాశముంది. డిసెంబర్లో జరిగే సాధారణ ఎన్నికల్లో వీరంతా ఓటేయొచ్చు. నిత్యం ఓటు నమోదుకు చాన్స్..కానీ.. ఏడాదిలో 365రోజులు 24గంటల పాటు ఓటు నమోదుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ వచ్చే నెల 12వ తేదీ వరకు నమోదు చేసుకున్న వారికి ఈ ఏడాది డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకునే అవకాశమిస్తున్నారు. ఇటీవల జరిగిన పలు అనివార్య కారణాలతో ఎన్నికల సంఘం 12వ తేదీ వరకు గడువునిచ్చినట్లు తెలుస్తోంది. అందరూ కూడా గత నెల 25వ తేదీ వరకే ఓటు నమోదు, మార్పులు, చేర్పులకు అవకాశం ఉందనే అపోహలో ఉన్నారు. అయితే వచ్చేనెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను రెవెన్యూ యంత్రాంగం పరిశీలించి అర్హులకు ఓటు హక్కు కల్పించనుంది. ఈ విషయంపై అధికార యంత్రాంగం ఇంకా ప్రచారం కల్పించట్లేదు. త్వరలో జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్(ఈవీఎం), ఓటర్ వెరిఫయిడ్ పేపర్ ఆడిట్ ట్రయల్స్ (వీవీ ప్యాట్)పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక నుంచి ఓటు నమోదుపై కూడా ప్రచారం కల్పించాలని వివిధ పార్టీల నాయకులు కోరుతున్నారు. ఓటర్లు పెరిగే అవకాశం.. సెప్టెంబర్ 10వ తేదీన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల కాగా..కొత్త ఓటర్లుగా, మార్పులు, చేర్పులకోసం గత నెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ క్రమంలో ఫారం 6, 7, 8, 8ఏ వివిధ కేటగిరీలకు సంబంధించి బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ఓ)ల ద్వారా 59,186దరఖాస్తులు రాగా, ఆన్లైన్లో 19,566 దరఖాస్తులు వచ్చాయి. వాటిన్నింటినీ పరిశీలించిన అధికార యంత్రాంగం ఆ సమస్యలను పరిష్కరించారు. తాజాగా ఓటర్ల జాబితాను కూడా ప్రకటించారు. జిల్లాలో ఇప్పటివరకు 10,54,805మంది ఓటర్లు గా ఉండగా పురుషులు 5,18,681మంది ఉన్నారు. మహిళలు 5,36,053మంది ఉండగా ఇతరులు 71 మంది ఉన్నారు. జిల్లాలో వచ్చే నెల 12వ తేదీ వరకు ఓటరు దరఖాస్తులు, మార్పులు చేర్పులకు అవకాశం ఉండగా త్వరలో మరికొన్ని ఓట్లు పెరిగే అవకాశముంది. నమోదు ప్రక్రియ ఇలా.. ఫారం 6: కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు ఫారం 7: అభ్యంతరాల తొలగింపునకు ఫారం 8: వివరాలు సరి చేసుకునేందుకు ఫారం 8ఏ: ఓటర్ల జాబితాలో పేరును మరో చోటుకు మార్చుకునేందుకు. -
యువహో..
సాక్షి, మెదక్: జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరుగుతోంది. ముసాయిదా జాబితా లెక్కల ప్రకారం జిల్లాలో 10వేల మంది ఓటర్లు పెరిగారు.అక్టోబర్ 8వ తేదీన తుది ఓటరు జాబితా ప్రకటించే నాటికి ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో 18 ఏళ్లు నిండిన యువత ఓటు నమోదు చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఓటరు జాబితా సవరణ కూడా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం 4,390 దరఖాస్తులు చేసుకున్నారు. ఈనెల 25వ తేదీ ఓటరు నమోదుకు చివరి అవకాశం. నమోదు చేసుకునే వారి సంఖ్య మరింత పెరుగుతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అధికార యంత్రంగం ఇది వరకే ఓటరు నమోదు కోసం అన్ని గ్రామాల్లో ప్రచారం ప్రారంభించింది. జనవరి1, 2018 నాటికి 18 ఏళ్ల వయస్సు నిండిన యువతీ, యువకులు తమ పేర్లు ఓటరు జాబితాలో నమోదు చేయించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం కళాశాలల్లో ‘చునావ్ పాఠశాల’ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులే కమిటీలుగా ఏర్పడి ఓటు నమోదు ఆవశ్యకత గురించి కళాశాలల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే రాజకీయ పార్టీలు 18 ఏళ్లు నిండిన వారిని ఓటరు జాబితాలో చేర్పించేందుకు ప్రత్యేక చొరువ చూపుతున్నారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గంలోని అన్ని రాజకీయపార్టీల కార్యకర్తలు గ్రామాల్లో పర్యటిస్తూ అర్హులైన వా వివరాలను సేకరిస్తూ ఓటరు జాబితాలో పేరు చేర్చేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ప్రకటించిన ఓటరు జాబితాలో జిల్లాలో మొత్తం 3,60,828 మంది ఓటర్లు ఉన్నారు. ఇటీవల ప్రకటించిన ఓటరు ముసాయిదా జాబితాలో ఆ సంఖ్య 3,71,373కు చేరుకుంది. ఓటరు జాబితా సవరణల కారణంగా మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో మొత్తం 10,545 మంది ఓటర్లుగా పెరిగారు. ప్రస్తుతం ఇంకా ఓటర్ల సవరణ కొనసాగుతోంది. ఈనెల 25 వరకు సవరణలు చేయనున్నారు. ముసాయిదా జాబితా ప్రకటనకు ముందు మెదక్ నియోజకవర్గంలో 1,78,364 మంది ఓటర్లు ఉన్నారు. ముసాయిదా జాబితాలో 1,82,464కు పెరిగింది. నర్సాపూర్ నియోజవర్గంలో గత ఓటరు జాబితాలో 1,82,464 ఉండగా ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 1,88, 909 కు పెరిగింది. తుది ఓటరు జాబితా ప్రకటించే నాటికి మరో 5 నుంచి 8వేల వరకు ఓటర్లు పెరగొచ్చని అధికారుల అంచనా. ఓటరుగా నమోదుకు ఆసక్తి ఓటరుగా తమ పేరు నమోదుచేసుకునేందకు జిల్లాలో అర్హులు ఆసక్తి చూపుతున్నారు. అధికారుల సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కొత్త ఓటరుగా నమోదు కోసం ఫామ్ 6 ద్వారా 4,390 మంది దరఖాస్తు చేసుకున్నారు. మెదక్ నియోజకవర్గం నుంచి 3,044, నర్సాపూర్ నియోజకవర్గం నుంచి 1,346 దరఖాస్తులు అందాయి. ఓటరు జాబితాలో నుంచి పేరు తొలగింపు కోసం ఫామ్ 7 ద్వారా మొత్తం 2,025 దరఖాస్తులు వచ్చాయి. మెదక్ నియోజకవర్గంలో 1,152, నర్సాపూర్‌లో 8,73 దరఖాస్తులు అందాయి. ఓటరు జాబితాలో పేర్లు, చిరునామా తదితర సవరణల కోసం ఫామ్ 8 ద్వారా అధికారులకు 1,811 దరఖాస్తులు అందాయి. ఇందులో మెదక్ నియోజకవర్గంలో 779, నర్సాపూర్‌లో 1032 దరఖాస్తులు ఉన్నాయి. ఓటు బదిలీ కోసం ఫామ్ 8ఏ ద్వారా 285 దరఖాస్తులు వచ్చాయి. మెదక్ నుంచి 152, నర్సాపూర్ నుంచి 133 అందాయి. కొత్త ఓటర్లు నమోదు కోసం 4,390 దరఖాస్తులు రాగా ఇందులో 2వేల దరఖాస్తులు 18 ఏళ్లు నిండిన వారివిగా ఉన్నట్లు తెలిపారు. కాగా ఓటరు నమోదు, సవరణ కార్యక్రమాన్ని కలెక్టర్ ధర్మారెడ్డి మంగళవారం పరిశీలించారు. మెదక్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి తహసీల్దార్, బూత్‌లెవల్ ఆఫీసర్లతో మాట్లాడారు. యువతీయువకులు ముందుకు రావాలి జిల్లాలోని 18 ఏళ్లు నిండిన యువతీయువకులు తమ పేర్లను ఓటరు జాబితాలో చేర్చుకోవాలని కలెక్టర్ ధర్మారెడ్డి కోరారు. జనవరి 1, 2018 నాటికి 18 ఏళ్ల వయస్సు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. ఆన్లైన్ లేదా బూత్‌లెవల్ అధికారికి దరఖాస్తు ఇవ్వటం ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్హులైన వారు ఫామ్ 6 పూర్తి అందజేయాలన్నారు. ఫామ్ 6తో పాటు రెండు ఫొటోలు, ఎస్ఎస్సీ సర్టిఫికెట్, ఆధార్‌కార్డు జతచేయాలని సూచించారు. ఫామ్ 6 ఇచ్చిన వెంటనే వీఆర్వో దరఖాస్తుదారుల స్థానికత, సాధారణ నివాసాన్ని ధ్రవీకరించుకుని ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌కు అందజేస్తారన్నారు. ఈనెల 25వ తేదీ వరకు సమయం ఉన్నట్లు తెలిపారు. బీఎల్ఓలతో ఓటరు జాబితా సవరణ గురించి మాట్లాడుతున్న కలెక్టర్ ధర్మారెడ్డి -
ఓటరు దరఖాస్తులకు 10లోగా పరిష్కారం
గుంటూరుసిటీ, న్యూస్‌లైన్: జిల్లాలోని ఓటరు నమోదు, మార్పులకు సంబంధించి స్వీకరించిన దరఖాస్తులను ఈనెల 10వ తేదీలోగా పరిష్కరించాలని ఎన్నికల సంఘం నియమించిన ఓటరు నమోదు పరిశీలకురాలు అనితా రాజేంద్ర అధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో జరిగిన సమావేశంలో ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో ఆమె మాట్లాడారు. దరఖాస్తులను కూలంకషంగా పరిశీలించాలని, బీఎల్వోలను, వీఆర్వోలను, పంచాయతీ కార్యదర్శులను ఇంటింటికి ఓటరు తనిఖీకి పంపాలన్నారు. ఏవిధమైన పొరపాట్లు జరిగినా అందుకు ఎన్నికల సంఘం తీసుకునే చర్యలకు అందరూ బాధ్యులు కావలసి ఉంటుందన్నారు. పదేళ్ల కిందట ఓటరు నమోదు ప్రక్రియలో జరిగిన పొరపాటుకు ఒక జిల్లా కలెక్టరుపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలను ఆమె అధికారులకు గుర్తు చేశారు. ఓటరు నమోదు ప్రక్రియలో నియమించిన ప్రతీ అధికారి ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇదేనెల 16వ తేదీన ఓటర్లు తుది జాబితాను ప్రకటించాలని, కొత్తగా నమోదు చేసుకున్న వారికి ఈనెల 25న జరిగే ‘జాతీయ ఓటర్ల దినోత్సవం’ రోజున ఫొటో గుర్తింపు కార్డులను పంపిణీ చేయవలసి ఉంటుందని తెలిపారు. ఇప్పటికే ఎన్నికల సంఘం వివిధ కారణాల వల్ల రెండు సార్లు పరిశీలించి పరిష్కరించేగడువును పొడిగించిందని, ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగింపు ఉండదని ఆమె స్పష్టం చేశారు. అభ్యంతరాల పరిశీలన పూర్తికాగానే డేటా అప్డేషన్ జరగాలన్నారు. ఓటరు నివాసం ఉన్నచోటే ఓటుహక్కు కల్పించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ మాట్లాడుతూ స్వీకరించిన క్లెయింలను, అభ్యంతరాలను ఈనెల 10వ తేదీన పరిశీలన, పరిష్కారం పూర్తిచేసి డేటా అప్డేట్ చేయిస్తామని చెప్పారు. 16వ తేదీన ఓటర్ల తుదిజాబితా విడుదలకు సిద్ధం చేస్తామన్నారు. కళాశాల లేదా ప్రైవేటు వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థుల విషయంలో వారు కోరుకున్న చోట అంటే వారి తల్లిదండ్రులు ఉన్నచోటగాని,చదువుకుంటున్న ప్రాంతాల్లోగానీ ఓటుహక్కు కల్పించాలన్నారు. పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితుల విషయంలో కొత్త కాలనీలకు తమ కుటుంబంతో సహా పూర్తిగా తరలిన వారికే ఆ కాలనీలో ఓటు హక్కు కల్పించాలని చెప్పారు. సమావేశంలో జేసీ వివేక్‌యాదవ్, అదనపు జేసీ కె.నాగేశ్వరరావు, డీఆర్వో కె.నాగబాబు, 17 నియోజకవర్గాల ఈఆర్వోవోలు, సహాయ ఈఆర్వోవోలు తదితరులు పాల్గొన్నారు. అవకతవకలపై విచారణ జరిపించండి.. కొరిటెపాడు: ఓటర్ల నమోదు, తొలగింపుల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని టీడీపీ నాయకులు శుక్రవారం ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లా ఎన్నికల పరిశీలకురాలు అనితా రాజేందర్, కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్‌లను కలసి వినతి పత్రం సమర్పించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ కింది స్థాయి రెవెన్యూ అధికారుల అవినీతి, పక్షపాత వైఖరి కారణంగా ఓటర్ల నమోదు కార్యక్రమం పక్కదారి పడుతోందని, అధికార పార్టీ నాయకుల ఒత్తిడిలకు లొంగి టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. వేమూరు, వట్టిచెరుకూరు, నాదెండ్ల, సత్తెనపల్లి, పొన్నూరు, దుగ్గిరాల తదితర మండలాల్లో అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయని, తగు విచారణ జరిపించాలని కోరారు. అనిత రాజేందర్ స్పందిస్తూ విచారణ జరిపించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మన్నవ వెంట ఆ పార్టీ నాయకులు కనగాల చిట్టిబాబు, సగ్గెల రూబెన్, జి.దయారత్నం తదితరులు ఉన్నారు.