
రెండు ఆస్పత్రులకు మున్సిపల్ అధికారులు రూ.16 లక్షల జరిమానా విధించారు.
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో అనారోగ్య లక్షణాలున్న వ్యక్తులను భయపెట్టి అవసరం లేకున్నా ఆస్పత్రుల్లో చేర్చుకొని, భారీగా బిల్లులు వసూలు చేస్తున్న థానేలోని రెండు ఆస్పత్రులకు మున్సిపల్ అధికారులు రూ.16 లక్షల జరిమానా విధించారు. కరోనా వైరస్ మొదలైన తరువాత ఇలా జరిమానా విధించడం రాష్ట్రంలో ఇదే ప్రథమం. ఈ రెండు ఆసుపత్రులు 13 మందిని ఏడు రోజులపాటు అడ్మిట్ చేసుకుని, వారి నుంచి బిల్లుల రూపంలో రూ.లక్షలు దండుకున్నాయి. దీనిపై ఫిర్యాదులు అందడంతో ఈ రెండు ఆసుపత్రులకు జరిమానా విధించారు.
(చదవండి: చైనాతో శాంతియుత పరిష్కారం)