మణిరత్నం దర్శకత్వంలో ఐశ్వర్యారాయ్‌? | Abhishek and Aishwarya in Mani Ratnam's next | Sakshi
Sakshi News home page

మణిరత్నం దర్శకత్వంలో ఐశ్వర్యారాయ్‌?

Published Sun, Apr 16 2017 3:00 AM | Last Updated on Tue, Sep 5 2017 8:51 AM

మణిరత్నం దర్శకత్వంలో ఐశ్వర్యారాయ్‌?

మణిరత్నం దర్శకత్వంలో ఐశ్వర్యారాయ్‌?

మణిరత్నం దర్శకత్వంలో మరోసారి మాజీ ప్రపంచ సుందరి నటించనున్నారా? అన్న ప్రశ్నకు అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాధానం కోలీవుడ్‌లో వస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి తానెప్పుడూ సిద్ధమే అని నటి ఐశ్వర్యారాయ్‌ ఓపెన్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ అందగత్తెను కోలీవుడ్‌కు ఇరువర్‌ చిత్రం ద్వారా పరిచయం చేసిన దర్శకుడు మణిరత్నమేనన్న విషయం విదితమే.ఆ తరువాత గురు, రావణన్‌ చిత్రాలు వీరి కాంబినేషన్‌లో తెరకెక్కాయి.

మణిరత్నం దర్శకత్వం వహించిన కాట్రువెలియిడై చిత్రం ఇటీవల విడుదలై మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. ఏదైతేనేం మణిరత్నం తదుపరి చిత్రానికి సిద్ధం అయ్యారని సమాచారం. ఈ మరోసారి అభిషేక్‌బచ్చన్, ఐశ్వర్యారాయ్‌ దంపతులతో చిత్రం చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు టాక్‌. ఆ మధ్య రణబీర్‌కపూర్‌కు జంటగా హే దిల్‌ హై ముష్కిల్‌ చిత్రంలో ఐశ్వరాయరాయ్‌ చాలా సన్నిహితంగా నటించారన్న ప్రచారం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే.

 దీంతో అభిషేక్‌ బచ్చన్‌ ఐశ్వర్యారాయ్‌ల మధ్య విభేధాలు తలెత్తి పరిస్థితి విడిపోయే వరకూ రాగా సన్నిహితులు పూనుకుని ఇద్దరికి నచ్చజెప్పి చక్కపరచినట్లు వార్తలు ప్రచారం అయ్యాయి. ఇలాంటి పరిస్థితిలో అభిషేక్‌బచ్చన్‌ ఐశ్వర్యారాయ్‌ల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచే విధంగా వారిద్దరిని కలిపి చిత్రం చేయాలని మణిరత్నం భావించినట్లు సమాచారం.అభిషేక్‌బచ్చన్‌ కూడా ఇంతకు ముందు మణిరత్నం దర్శకత్వంలో గురు, రావణన్‌ హిందీ వెర్షన్‌ చిత్రాల్లో నటించారు.

తాజా చిత్రం విషయమై మణిరత్నం అభిషేక్‌బచ్చన్‌ను కలిసి చర్చించినట్లు, అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినా తాను, ఐశ్వర్య కలిసి నటించాలంటే అందుకు కథ సెట్‌ అవ్వాలని, అది చాలా ప్రత్యేకంగా ఉండాలని, అంతే కానీ తామిద్దం కలిసి నటించాలని ఏదో ఒక కథా చిత్రంలో నటించడం కుదరదని భావాన్ని వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరి మణిరత్నం ఆ దంపతులను మెప్పించే కథను సిద్ధం చేస్తున్నారా అన్నది తెలియాల్సిఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement