తొలి చిత్రంతోనే టాలీవుడ్‌కు ..
తమిళసినిమా: కష్టానికి ఫలితం లభిస్తుందంటారు. వర్ధమాన నటుడు అనంతరామ్ జీవితంలోనూ ఇది నిజమైంది. కాస్త ఆలస్యమైనా తంతే బూరెల బుట్టలో పడ్డట్టు తొలి చిత్రంతోనే సక్సెస్‌ను జేబులో వేసుకున్నాడు. యువ సంగీత దర్శకుడు హిప్‌హాప్ తమిళా దర్శకుడిగా, కథానాయకుడిగా పరిచయమై తెరపైకి వచ్చిన చిత్రం మీసైమురుక్కు. ప్రముఖ దర్శకుడు సుందర్.సీ నిర్మించిన ఈ చిత్రం విడుదలై మూడో వారంలోకి అడుగు పెట్టి మంచి వసూళ్లను రాబడుతోంది.
కాగా ఇందులో హిప్‌హాప్ తమిళాకు తమ్ముడిగా ప్రాధాన్యం కలిగిన పాత్ర ద్వారా పరిచయమైన నటుడు అనంతరామ్. మీసైమురుక్కు విజయం సాధించడంతో యమ జోష్‌లో ఉన్న ఈ నవ నటుడు పేర్కొంటూ తనకు చిన్న తనం నుంచి నటుడవ్వాలన్నది కల అన్నాడు. దాన్ని నిజం చేసుకోవడానికి చెన్నైలోని లయోలా కళాశాలలో విజువ్ కమ్యూనికేషన్ చదివానని తెలిపారు. అదే విధంగా లండన్‌లోని ట్రినిటీ యాక్టింగ్ స్కూల్‌లో శిక్షణ పొందానని చెప్పారు.
చెన్నైలోని ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో మెరుగులు దిద్దుకున్నానని తెలిపారు. అయితే నటుడవ్వడానికి నాలుగేళ్లకు పైగా శ్రమించానని, అలా స్నేహితుల ద్వారా మీసైమురుక్కు చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని తెలిపా రు. ఇది యువకులు కలిసి నటించిన చిత్రం కావడంతో చాలా జాయ్‌ఫుల్‌గా సాగిందన్నారు. ఇందులో హిప్ హాప్ తమిళాతో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. అ దే విధంగా సీనియర్ నటుడు వివేక్‌కు కొడుకుగా నటించడం మరపురాని అనుభవం అన్నారు.
ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. మీసైమురుక్కు చిత్రంలో తన పాత్రకు చాలా మంచి పేరు వచ్చిందని, చాలా మంది ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ఈ చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో మరిన్ని మంచి పాత్రలు చేయాలని ఆశిస్తున్నానన్నారు. విలన్‌గా చేయడానికైనా సిద్ధమేనని అన్నారు. అదే విధంగా టాలీవుడ్‌లోనూ పరిచయం కానున్నానని, ప్రముఖ తెలుగు దర్శకుడి చిత్రంలో మంచి పాత్రలో నటించనున్నానని అనందరామ్ వెల్లడించారు.